
మహేశ్వర్ రెడ్డి, శివశంకర్ కుటుంబాలకు పరామర్శ
పులివెందుల నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతోంది.
కడప: పులివెందుల నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఆయన గురువారం ఉదయం లింగాల మండలంలో మహేశ్వర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం శివశంకర్ రెడ్డి కుటుంబ సభ్యులతో ఆయన భేటీ అయ్యారు.
ఆ తర్వాత ఎంపీడీవో కార్యాలయంలో వైఎస్ జగన్.. ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, నేతలతో ప్రజా సమస్యలపై చర్చించారు. కాగా వైఎస్ జగన్ రెండురోజుల పాటు పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు.