సర్కార్‌ మెడలు వంచేందుకే ‘రైతు దీక్ష’ | YS Jagan mohan reddy raithu deeksha on may 1,2nd in guntur | Sakshi
Sakshi News home page

సర్కార్‌ మెడలు వంచేందుకే ‘రైతు దీక్ష’

Published Sat, Apr 22 2017 1:05 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

సర్కార్‌ మెడలు వంచేందుకే ‘రైతు దీక్ష’ - Sakshi

సర్కార్‌ మెడలు వంచేందుకే ‘రైతు దీక్ష’

- వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ వెల్లడి
- ఈ నెల 26, 27న జరగాల్సిన దీక్ష తేదీల్లో మార్పు  
- మే 1, 2 తేదీల్లో గుంటూరులో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష


సాక్షి, హైదరాబాద్‌: రైతన్నలు పండించిన పంటలకు ప్రభుత్వం మెడలు వంచైనా కనీస మద్దతు ధర ఇప్పించేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరులో రైతు దీక్ష చేపడుతున్నారని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ నెల 26, 27న జరగాల్సిన దీక్ష తేదీల్లో మార్పు చేసినట్లు తెలిపారు. వచ్చే నెల 1, 2వ తేదీల్లో జగన్‌ రైతు దీక్ష చేస్తారని వెల్లడించారు. బొత్స శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

జగన్‌ దీక్షకు రైతు సోదరులంతా మద్దతి వ్వాలని కోరారు.కాగా రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తామంటూ అధికార పార్టీ నుంచి వస్తున్న సంకేతాలపై మీడియా ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. టీడీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందని, ప్రజలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని స్వాగతిస్తున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement