సాక్షి, అమరావతి : లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చేఅవకాశాలున్నందున అనుసరించాల్సిన విధానంపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనిపై పూర్తిస్థాయిలో కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. క్వారంటైన్‌లో అందించాల్సిన సదుపాయాలు, వసతిపై ఇప్పటి నుంచే దృష్టిపెట్టాలని, వివిధ రాష్ట్రాలనుంచి వస్తున్నవారి విషయంలో కూడా సరైన విధానాన్ని అనుసరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్-19 నివారణా చర్యలపై ఉన్నతాధికారులతో చర్చించారు. అలాగే ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రజలను స్క్రీనింగ్ చేయడం, అవసరమైన వారిని క్వారంటైన్‌కు తరలించడం తదితర అంశాలపై ఆన్నతాధికారులతో ముఖ్యమంత్రి విస్తృతంగా చర్చ జరిపారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి పాల్గొన్నారు. (ఫేస్ మాస్క్ ఉంటేనే పెట్రోల్, డీజిల్)
సీఎం జగన్ మాట్లాడుతూ.. క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలు, పారిశుద్ధ్యం, భోజనం తదితర అంశాలపై క్రమం తప్పకుండా సమీక్ష చేయాలని ఆదేశించారు. వీటిపై ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని సీనియర్ ఐఎఎస్ అధికారి కృష్ణబాబుకు సూచించారు. సదుపాయాలు, పారిశుద్ధ్యం, భోజనం, మందులు అందుతున్నాయా లేదా అన్నదానిపై క్వారంటైన్లో ఉన్నవారి నుంచి ఎప్పటికప్పుడు అభిప్రాయాలు సుకుంటున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. క్వారంటైన్ సెంటర్లలో ఉన్న ప్రతి ఒక్కరి సెల్ నంబర్ తమ వద్ద ఉందని, కమాండ్ కంట్రోల్ నుంచి ర్యాండమ్‌గా కాల్‌చేసి వారి అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. విదేశాలనుంచి వచ్చే వారికి దాదాపుగా నాన్ కోవిడ్ సర్టిఫికెట్ ఉంటుందని, వారికి హోం క్వారంటైన్ విధిస్తామని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు తెలిపారు. అలాగే గుజరాత్ నుంచి విశాఖపట్నం, విజయనగరం నుంచి వచ్చిన మత్స్యకారులకు పూల్ శాంపిల్స్ చేసి ఫలితాల ఆధారంగా ఇళ్లకు పంపిస్తామని అన్నారు. ఇక శ్రీకాకుళం చేరుకునేవారికి కూడా సెంటర్లు ఏర్పాటుచేసి, పరీక్షలు చేసి ఫలితాల ఆధారంగా ఇళ్లకు పంపిస్తామని తెలిపారు. (ప్రత్యేక రైళ్లు వేయండి: సుశీల్ మోదీ)
కోవిడ్-19 మరణాలు తగ్గించేందుకు వ్యూహం
రాష్ట్రంలో ఇప్పటివరకూ 1,00,997 కోవిడ్-19 పరీక్షలు నిర్వహించామని, నిన్న ఒక్కరోజే 7902 పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ప్రతి మిలియన్‌కు 1919 చొప్పున పరీక్షలు నిర్వహిస్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 235 క్లస్టర్లు, 79 వెరీ యాక్టివ్ క్లస్టర్లు, 68 యాక్టివ్ క్లస్టర్లు, 53 డార్మంట్ క్లస్టర్లు, 35 క్లస్టర్లలో 28 రోజుల నుంచి కేసులు లేవని అధికారులు వెల్లడించారు. కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన దాదాపు 32,792 మందిలో 17,585 మందికి పరీక్షలు చేశామని, మిగిలిన వారికి 2–3 రోజుల్లో పరీక్షలు పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. వీరిలో 4వేల మంది హైరిస్క్ ఉన్నవారిగా గుర్తించినట్లు పేర్కొన్నారు. అయితే వీరికి పరీక్షలు చేసి... లక్షణాలు ఉంటే.. ముందస్తు వైద్యం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.
(విజయ్ రూపానీకి కృతజ్ఞతలు చెప్పిన సీఎం జగన్ )
కరోనా కారణంగా మరణాలు సంభవించకుండా చూడాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామన్న అధికారులు సీఎంకు తెలిపారు. జిల్లాల వారీగా ప్రత్యేక నంబర్లు కేటాయిస్తున్నామని, హైరిస్క్ ఉన్నవారు శ్వాసకోసతో సంబంధిత సమస్యలతోగాని, ఇతరత్రా వ్యాధులతో బాధపడుతున్నవారు ఏమాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నా వెంటనే ఈ నంబర్లకు కాల్ చేస్తే.. వెంటనే వైద్యం అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నామన్న అధికారులు తెలిపారు. టెలిమెడిసన్, విలేజ్ క్లినిక్, పీహెచ్‌సీల మధ్య సరైన సమన్వయం ఉండాలన్న సీఎం జగన్ అన్నారు. భవిష్యత్తులో ప్రజలకు అత్యంత చేరువగా ఉన్న వైద్య వ్యవస్థగా తీర్చిదిద్దాలని, టెలీమెడిసిన్‌ద్వారా ప్రిస్కిప్షన్ పొందడం, అక్కడనుంచి నేరుగా విలేజ్ క్లినిక్ ద్వారా మందులు సరఫరాచేయడం జరగాలన్నారు. (బాలీవుడ్ విషాదం: నటుడి తండ్రి కన్నుమూత)
వ్యవసాయం, అనుబంధ రంగాలు
ధాన్యం సేకరణ అన్ని జిల్లాల్లో చురుగ్గా సాగుతోందని అధికారులు ముఖ్యమంత్రి జగన్‌కు తెలిపారు. ఒక్క కృష్ణా జిల్లాలో ధాన్యం సేకరిస్తున్న సమయంలో బస్తాకు కొంత ధాన్యాన్ని మినహాయిస్తున్నారంటూ రైతులనుంచి వచ్చిన ఫిర్యాదులపై సమావేశంలో చర్చ జరగగా.. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ, సెక్రటరీ, డీజీపీ లాంటి వ్యక్తులంతా ఇదే కృష్ణా జిల్లాలో ఉన్నాసరే.. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం సరికాదన్నారు. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని, వెంటనే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించించారు. పంటలను రోడ్డుమీద వేసిన ఘటనలు గత ప్రభుత్వ హయాంలో రోజూ కనిపించేవని, అలాంటి ఘటనలు ఈ ప్రభుత్వ హయాంలో కనిపించడానికి వీల్లేదని చెప్పిన ముఖ్యమంత్రి చీనీ, అరటి, టమోటో, మామిడి ప్రాససింగ్ ప్లాంట్లపై దృష్టి పెట్టాలని, వచ్చే ఏడాది.. ఈ పంటల విషయంలో మళ్లీ మార్కెటింగ్ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
(బాలుడిపై యువకుడి అత్యాచారం, ఆపై..)
వివిధ స్థాయిలో వ్యవసాయ సలహామండళ్లు
‘‘రైతు భరోసా కేంద్రాలకు నెట్, విద్యుత్ సహా అన్ని సౌకర్యాలను వెంటనే కల్పించాలి. –ఏ ఊరిలో ఏ పంట వేయాలన్న విషయాన్ని ఆర్‌బీకేల ద్వారా అవగాహన కలిగించాలి. ఏ పంట వేస్తే మార్కెట్‌లో మంచి ధరకు అమ్ముడు పోయే అవకాశాలున్నాయన్నదానిపై రైతులకు అవగాహన కలిగించాలి. ప్రతి ఊర్లో కూడా ఏయే పంటలు ఎంతమేర పండించాలన్నదానిపై రైతులతో కలిసి కూర్చుని నిర్ణయించుకోవాలి. జాతీయ అంతర్జాతీయంగా వివరాలను విశ్లేషించి.. ఆమేరకు కార్యాచరణ ఉండాలి. రాష్ట్రస్థాయి వ్యవసాయ అడ్వైజరీ బోర్డులు, జిల్లా అడ్వైజరీ బోర్డులు, మండల అడ్వైజరీ బోర్డులు ఏర్పాటుకు ఆదేశం. ఏయే పంటలు, ఎక్కడ ఎంతమేర సాగు చేయాలన్నదానిపై ఈ-బోర్డులు సలహాలు ఇవ్వాలి. ఈ-బోర్డుల ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలి’’.(కిలో మటన్ రూ.700కే అమ్మాలి)
‘‘రాష్ట్రస్థాయి అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డులు, జిల్లా స్థాయి బోర్డులకు, అక్కడ నుంచి మండల స్థాయి అడ్వైజరీ బోర్డులకు ఏయే పంటలు, ఎక్కడ వేయాలన్న దానిపై రైతులకు సూచనలు చేయాలి. పంటలు వేసేటప్పుడే ధర ప్రకటించి, రైతుకు ఆ ధర దక్కేలా చూడాలి. దీనివల్ల రైతుల్లో విశ్వాసం కలుగుతోంది. పంటలను ఇ-క్రాపింగ్ చేయడం, రైతు భరోసాకేంద్రాలను వినియోగించి వాటిని కొనుగోలు చేయడం.. ఈ ప్రక్రియలన్నీ.. వ్యవస్థీకృతంగా సాగిపోవాలి. గత ప్రభుత్వం హయాంలో ఏరోజూ వ్యవసాయం మీద దృష్టిపెట్టలేదు. మన ప్రభుత్వం వచ్చాక వ్యవసాయం, అనుబంధ రంగాలు, వాటి పరిస్థితుల మెరుగుదల కోసం ప్రత్యేకంగా దృష్టిపెట్టి విస్తృతంగా సమీక్షించుకుంటున్నాం. ఇంతచేస్తున్నప్పుడు కచ్చితంగా ఫలితాలు రావాలి’’ అని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. (సర్‌గమ్ షూటింగ్ గోదారి తీరానే.. )
Comments
Please login to add a commentAdd a comment