
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ గురువారం కర్నూలు వెళ్తున్నారు. కర్నూలు మండలం దిన్నెదేవరపాడులో జరిగే పత్తికొండ ఎమ్మెల్యే కె.శ్రీదేవి కుమారుడి వివాహ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరుతారు. 10.40 గంటలకు ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి 11.10 గంటలకు దిన్నెదేవరపాడు గ్రామంలోని రాగమయూరి రిసార్ట్స్‌కు చేరుకుని, వివాహ కార్యక్రమంలో పాల్గొని వధూవరులను ఆశీర్వదిస్తారు. 1.20 గంటలకు తిరిగి తాడేపల్లి చేరుకుంటారు.