మా బతుకులు బూడిదయ్యాయి | YS Jagan visits Amalapuram Hospital | Sakshi
Sakshi News home page

మా బతుకులు బూడిదయ్యాయి

Jun 28 2014 6:36 PM | Updated on Jul 25 2018 4:09 PM

మా బతుకులు బూడిదయ్యాయి - Sakshi

మా బతుకులు బూడిదయ్యాయి

గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలిన దుర్ఘటనలో తమ బతుకులు బూడిదయ్యాయని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డికి చెప్పారు.

అమలాపురం: గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలిన దుర్ఘటనలో తమ బతుకులు బూడిదయ్యాయని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన  రెడ్డికి చెప్పారు.   తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్‌ పైప్‌లైన్‌ పేలిన  ప్రదేశాన్ని పరిశీలించి, అక్కడి బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన అమలాపురంలోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. నగరం విషాద ఘటనలో తీవ్రంగా కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.

బాధితులు జరిగిన ఘటన తలచుకుంటే భయపడిపోతున్నారు. వణికిపోతున్నారు. ఓ బాధితురాలు మాట్లాడుతూ తమ కుటుంబంలో 11 మంది ఉన్నట్లు తెలిపారు. వారిలో ఏడుగురు కాలిపోయినట్లు చెప్పారు. మరో మహిళ మాట్లాడుతూ నిద్రపోతున్న పిల్లలను బయటకు తీసుకువచ్చేసరికే మంటలు ఇంటిలోపలకు వచ్చేశాయన్నారు.

తమ ఆస్పత్రిలో ఏడుగురు చికిత్స పొందుతున్నట్లు డాక్లర్ చెప్పారు.  చికిత్స పొందుతున్నవారిలో అయిదుగురు ఆడవారు, ఇద్దరు మగవారు వున్నట్లు తెలిపారు. వారు కోలుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement