చంద్రబాబుది ప్రచార ఆర్భాటమే : వైఎస్‌ జగన్‌ | ys jaganmohanreddy fires on chandrababu over Paidipalem Reservoir | Sakshi
Sakshi News home page

చంద్రబాబుది ప్రచార ఆర్భాటమే : వైఎస్‌ జగన్‌

Published Sat, Feb 4 2017 1:40 PM | Last Updated on Sat, Jul 28 2018 3:15 PM

చంద్రబాబుది ప్రచార ఆర్భాటమే : వైఎస్‌ జగన్‌ - Sakshi

చంద్రబాబుది ప్రచార ఆర్భాటమే : వైఎస్‌ జగన్‌

పైడిపాలెం రిజర్వాయర్‌ను వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శనివారం పరిశీలించారు.

వైఎస్‌ఆర్‌ జిల్లా  :
పైడిపాలెం రిజర్వాయర్‌ను వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శనివారం పరిశీలించారు. పైడిపాలెం రిజర్వాయర్‌లో 80 శాతం పనులు దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పూర్తి చేస్తే, అంతా తానే చేశానంటూ సీఎం చంద్రబాబునాయుడు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు. రూ.300 కోట్లు ఖర్చు పెడితే ఈ పాటికి రాయలసీమ సస్యశ్యామలమయ్యేదని తెలిపారు. చంద్రబాబుకు ప్రాజెక్టులపై కంటే.. కాంట్రాక్టుల మీద వచ్చే కమీషన్ల మీదే ఆసక్తి ఎక్కువని మండిపడ్డారు. ప్రాజెక్టులపై చంద్రబాబుది ప్రచార ఆర్భాటమేనని ఎద్దేవా చేశారు.

పురుషోత్తపట్నం ప్రాజెక్టు పనులపై విచారణ జరిపేందుకు కానిస్టేబుల్‌ చాలు అని వైఎస్‌ జగన్‌ సూచించారు. రూ.120 కోట్ల పరిహారం చెల్లిస్తే పులిచింతలలో 45 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో పాటూ, ప్రకాశం బ్యారేజీ నుంచి వృధాగా సముద్రంలో కలిసే 55 టీఎంసీల నీటిని కాపాడునే వాళ్లమని పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement