ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో నేడు విజయమ్మ పర్యటన | YS Vijayamma to visit Khammam, Nalgonda districts today | Sakshi
Sakshi News home page

ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో నేడు విజయమ్మ పర్యటన

Published Thu, Oct 31 2013 8:39 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో నేడు విజయమ్మ పర్యటన - Sakshi

ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో నేడు విజయమ్మ పర్యటన

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ నేడు నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఉదయం మధిర చేరుకున్నారు. జిల్లాలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితుల్ని పరామర్శిస్తారు.  

ఖమ్మం జిల్లాలో మధిరతో పాటు వైరా, పాలేరు, ఖమ్మం నియోజక వర్గాల్లో విజయమ్మ పర్యటిస్తారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న వరి, పత్తి, మొక్క జొన్న పంటలను పరిశీలించనున్నారు. రైతుల సమస్యల్ని తెలుసుకోనున్నారు. వర్షాలకు ఖమ్మం జిల్లాలో పత్తి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణ, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో విజయమ్మ పర్యటించి బాధితుల సమస్యల్ని తెలుసుకున్నారు. సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతుల్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement