తూ.గో: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మంగళవారం తూర్పు గోదావరి జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రేపు కాకినాడ నియోజక వర్గపరిధిలోని ముంపుప్రాంతాల్లో పర్యటించనున్నారు. జగ్గంపేట, కాట్రావులపల్లి, బిక్కవోలు, జి.మామిడాడ, రేలంగి, కరప గొల్లపాలెం, కాజులూరు మీదుగా ఆమె పర్యటన కొనసాగుతోంది. రేపు మధ్యాహ్నం కాకినాడలో వైఎస్ విజయమ్మ ప్రెస్‌మీట్ లో మాట్లాడతారు.
అనంతరం పండూరు, తిమ్మాపురం, పిఠాపురం, గొల్లప్రోలు, కత్తిపూడి, చిన్నయ్యపాలెం, ఏవీ నగరం, పెరుమాళ్లపురం, అన్నవరం, తుని ప్రాంతాల్లో పర్యటిస్తారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా లో విజయమ్మ పర్యటించారు. ముంపు పొలాలను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రంగు మారిన ధాన్యం, మొక్క జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు.