నెల్లూరు : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరి పట్ల వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిప్పులు చెరిగారు. గురువారం నెల్లూరు జిల్లా కావలిలో పార్టీ ఎమ్మెల్యే ఆర్ ప్రతాప్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షకు వారు సంఘీభావం ప్రకటించారు. రాష్ట్రంలో బోర్లు వేయాలన్నా సింగపూర్, జపాన్ల నుంచి నిపుణులను తీసుకుని రావాలని సీఎం చంద్రబాబు అంటారని చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో రైతులకు మేలు జరగలేదని ఆరోపించారు.
సొంత జిల్లా చిత్తూరులోనే బాబును ప్రజలు నమ్మె పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు హయాంలో నీటి పారుదల రంగం నిర్వీర్యమైందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు పట్టించుకోకుండా చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.