సమైక్య లక్ష్యం..దీక్షామార్గం
Published Thu, Oct 10 2013 4:50 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
కర్నూలు, న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఉద్యమకార్యచరణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. పత్తికొండ నియోజకవర్గం సమన్వయకర్త కోట్ల హరిచక్రపాణిరెడ్డి సమైక్య పోరు పాదయాత్ర బుధవారం రెండో రోజు కొనసాగింది. హోసూరు నుంచి ప్రారంభమై పత్తికొండ, రాతన, తుగ్గలి మీదుగా ఎద్దులదొడ్డి వరకు సాగింది. ఆయా గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించి పాదయాత్రలో పాల్గొన్నారు. నంద్యాలలో వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలకమండలి సభ్యులు భూమానాగిరెడ్డి ఆదేశాల మేరకు పద్మావతి నగర్‌లోని ఆర్చి దగ్గర కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షల్లో పది మంది పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
ఆదోనిలో స్థానిక నాయకులు చంద్రకాంత్‌రెడ్డి, ప్రసాదరావు, అబ్దుల్ ఖాదర్ నాయకత్వంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆళ్లగడ్డలో బి.వి.రామిరెడ్డి ఆధ్వర్యంలో నాలుగు రోడ్ల కూడలిలో రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. ఆలూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షల్లో 12 మంది పాల్గొన్నారు. మండల కన్వీనర్ చిన్నవీరన్న, ఆలూరు సింగిల్ విండో ఛైర్ పర్సన్ సౌమ్యారెడ్డి తదితరులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఆత్మకూరులో ఏరువ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్షల్లో 20 మంది పాల్గొన్నారు. డోన్‌లో మాజీ మండలాధ్యక్షుడు శ్రీరాములు ఆధ్వర్యంలో రాత్రి కాగడాల ప్రదర్శన నిర్వహించారు. రిలే నిరాహార దీక్షలు యథావిధిగా కొనసాగుతున్నాయి.
వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ప్యాపిలిలో జరుగుతున్న దీక్షల్లో పట్టణానికి చెందిన పది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. మంత్రాలయం రాఘవేంద్ర సర్కిల్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో కౌతాళం మండలం కాత్రికి, లింగాలదిన్నె గ్రామానికి చెందిన 15 మంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నందికొట్కూరులోని పటేల్ సెంటర్‌లో స్థానిక నాయకులు బండి జయరాజు ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. ఎమ్మిగనూరులో సోమప్ప సర్కిల్‌లో కేడీసీసీ మాజీ ఉపాధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. పాణ్యం నియోజకవర్గ సమన్వయకర్త గౌరుచరితారెడ్డి ఆధ్వర్యంలో కర్నూలు-నంద్యాల రోడ్డులోని గౌరీశంకర్ కాంప్లెక్స్ దగ్గర రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
Advertisement
Advertisement