ప్రతిపక్షం గొంతునొక్కి అబద్ధాలు ప్రచారమా?
వైసీపీ ఎమ్మెల్యేల మండిపాటు
దళిత సభ్యులను చిన్నచూపు చూస్తున్నారని ధ్వజం
హైదరాబాద్: శాసనసభలో మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడ్డారు. మంగళవారం వైఎస్సార్‌సీపీ సభ్యులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అం శంపై చర్చ సందర్భంగా ఆ వర్గ ప్రతి నిధులను మాట్లాడనివ్వలేదని, పైగా వైఎస్సార్ హయూం లో నిధులు పక్కదోవ పట్టాయని టీడీపీ దుష్ర్పచారం చేస్తోందని ఉప్పులేటి కల్పన మండిపడ్డా రు. వైఎస్సార్ తన హయూంలో చేసిన అభివృద్ధి మరెవరూ చేయలేదని తెలిపారు. చంద్రబాబు ఎస్సీ, ఎస్టీల నిధులు జన్మభూమికి మళ్లించారని ధ్వజమెత్తారు. తన పరిపాలనలో రూ. 10 వేల కోట్ల నిధులు మళ్లించిన సంగతి బాబు మరిచారన్నారు.
మేకా వెంకటప్రతాప అప్పారావు మాట్లాడుతూ బడ్జెట్‌లోని లోటుపాట్లను జగన్‌ను చెప్పనిస్తే అధికారపక్షం డొల్లతనం బయటపడుతుం దని, అందుకే సభా సమయం వృథా చేయడానికి టీడీపీ సభ్యులు, మంత్రులు కంకణం కట్టుకున్నారని విమర్శించారు. ప్రతిపక్ష సభ్యులకు మైక్ ఇవ్వకుండా ప్రజల గొంతు నొక్కాలను కోవడం సరికాదని ఎమ్మెల్యే ఆదిమూలం సురేష్ సూచించారు. తమ పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులను సస్పెండ్ చేయించి అధికార పక్ష సభ్యులు తమ నైజం చాటుకున్నారన్నారని ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్, ముస్తఫాలు విమర్శించారు. ప్రతి పక్ష పార్టీకి చెందిన దళిత సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై ైవె ఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు రాజన్నదొర, విశ్వాసరాయి కళావతి తదితరులు కూడా తీవ్రంగా తప్పుబట్టారు. టీడీపీ ప్ర భుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌లో నిజమెం తో, అవాస్తవాలెంతో తేలాలంటే శ్వేతపత్రం విడుదల ఒక్కటే మార్గమని ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి చెప్పారు.