ఆల్కాట్‌తోట(రాజమండ్రి) : పుష్కర యాత్రికులకు సరైన సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వం వారిని రోడ్లపాల్జేసిందని వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష ఉపనేత, పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ధ్వజమెత్తారు. స్థానిక ద్వార క లాడ్జి సమీపంలోనూ, ఆర్యాపురంలోనూ డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, నగరి ఎమ్మెల్యే, సినీ నటి ఆర్‌కే రోజా ప్రారంభించారు. అనంతరం జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ పుష్కర ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లుతెరిచి భక్తులకు పూర్తిస్థాయిలో వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. రోజా మాట్లాడుతూ పుష్కర భక్తులకు డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ,మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు కూడా పాల్గొన్నారు.
పుష్కర భక్తులకు రవాణా సదుపాయం కల్పించండి : ఎమ్మెల్సీ బోస్
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పుష్కర భక్తులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో రవాణా సౌకర్యం కల్పించాలని వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ డిమాండ్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఆర్యాపురంలోని డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిన్నపిల్లలకు పాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ప్రారంభించారు. అనంతరం పుష్కర భక్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమా ల్లో రాష్ట్ర కార్యదర్శి కర్రిపాపారాయుడు, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యద ర్శి మంచాల బాబ్జి, దొండపాటి సత్యం బాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఇసుకపల్లి శ్రీనివాస్, ఇన్నీసుపేట కో-ఆపరేటివ్ బ్యాంకు డెరైక్టర్ ఆదిరెడ్డి శ్రీనివాసరావు, రాజమండ్రి నగరపాలక సంస్థ ఫ్లోర్‌లీడర్, జిల్లా అధికారప్రతినిధి మేడపాటి షర్మిలారెడ్డి, కార్పొరేటర్లు బొంతాశ్రీహరి, మజ్జి నూకరత్నం, జిల్లా ప్రధాన కార్యదర్శి మానేదొరబాబు, జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి డాక్టర్ లంకా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
భక్తులను రోడ్ల పాల్జేసిన సర్కారు
Published Mon, Jul 20 2015 3:52 AM | Last Updated on Tue, May 29 2018 4:23 PM
Advertisement
Advertisement