బాబూ... జైట్లీ వ్యాఖ్యలపై నీ స్పందనేమిటి?
♦ వైఎస్సార్‌సీపీ శాసనసభ పక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ
♦ అసలు హోదా అవసరం అనుకుంటున్నారా? లేదా?
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేకహోదా శకం ముగిసిందన్న కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై తన వైఖరేమిటో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభపక్ష ఉప నాయకుడు జోత్యుల నెహ్రూ డిమాండ్ చేశారు. అరుణ్‌జెట్లీ వ్యాఖ్యలు చూస్తుంటే మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని చెప్పకనే చెప్పినట్టు కనిపిస్తోందన్నారు. ఆ వ్యాఖ్యలపై సీఎం స్పందించకపోవడాన్ని త ప్పుబట్టారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘అస లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలనుకుంటున్నారో లేదో సీఎం స్పష్టంచేయాలి.
అవసరమని చెబితే ఎప్పటిలోగా సాధించగలరో ప్రజలకు తేల్చి చెప్పాలి. కేంద్ర మంత్రిమండలి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన ఈ అంశంపై నీతి అయోగ్ కమిటీ చర్చిస్తుందం టూ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడం మంచిది కాదు. ప్రత్యేక హోదా కోసం ఇప్పటికే 8 మంది వరకు ఆత్మహత్యలు చేసుకున్నా పట్టించుకోకపోవడం దారుణం’’ అని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కాకుండా నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏమీ కనిపించడం లేదని ఆయన విమర్శించారు.
చిత్తశుద్ధి ఉంటే సీమకు మంచినీళ్లిచ్చేవారు
రాష్ట్రం కరువు మండలాలను ప్రకటించడం తప్ప కరువు నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం పూర్తిగా చేతులెస్తేంద ని నెహ్రూ దుయ్యబట్టారు. ఆరు నెలల్లో పట్టిసీమను పూర్తి చేసి కృష్ణా డెల్టాకు సాగునీరు, రాయలసీమకు తాగు నీరు ఇస్తామన్న ముఖ్యమంత్రి, మంత్రులు మాటలు నమ్మి కృష్ణా డెల్టా రైతులు పంటలు వేసుకుంటే పది పది హేను రోజులకు ఒక తడి అందక పంటలు ఎం డుతున్నాయని చెప్పారు. రాయలసీమకు తా గునీరు ఇవ్వాలన్న చిత్తశుద్ధి ఉంటే.. కనీసం మోటార్లు పెట్టయినా నీటిని పోతిరెడ్డి పాడు కాల్వల్లోకి తోడిపోసి ఆ ప్రాంత తాగునీటి అవసరాలను తీర్చగలిగేదని ఆయన విమర్శించారు.