
అవినాష్ రెడ్డి (ఫైల్ ఫోటో
సాక్షి, వైఎస్సార్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిది అధర్మపోరాట దీక్షని వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ అవినాశ్‌రెడ్డి ఆరోపించారు. అధర్మపాలన సాగిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ధర్మం, న్యాయం, చట్టం నీతిని చంద్రబాబు తుంగలో తొక్కేశారని విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లు బీజేపీతో కలిసివుండి టీడీపీ నేతలు కడప ఉక్కుఫ్యాక్టరీని మరిచిపోయారని మండిపడ్డారు. మంత్రివర్గ భేటీలో భుములను పంచుకోవడం తప్ప రాష్ట్రంలో నెలకొన్న కరుపుపై ఏనాడైనా చర్చించారా అని ప్రశ్నించారు. సీమవాసులు కేడీలని చెప్పిన చంద్రబాబుకు ఈప్రాంతంలో తిరిగే హక్కులేదని అవిశేష్ రెడ్డి అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment