ఏం సాధించారని వంద రోజుల పండుగ? | ysrcp leader ambati rambabu fire on tdp govt | Sakshi
Sakshi News home page

ఏం సాధించారని వంద రోజుల పండుగ?

Published Tue, Sep 16 2014 1:39 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

ఏం సాధించారని వంద రోజుల పండుగ? - Sakshi

ఏం సాధించారని వంద రోజుల పండుగ?

ధ్వజమెత్తిన అంబటి రాంబాబు

చంద్రబాబుది పచ్చి అబద్ధాల పాలన
మనీ, మర్డర్స్, మ్యానిపులేషన్, మీడియా మేనేజ్‌మెంట్... ఇదే బాబు ఫిలాసఫీ
తొలిరోజు చేసిన ఐదు సంతకాల్లో ఒక్కటైనా అమలైందా?
రుణమాఫీ అమలు కాకుండానే అబద్ధాలెందుకు?
వందరోజుల్లో దౌర్భాగ్యపు పాలన అందించారు

 
హైదరాబాద్: రైతుల రుణమాఫీ మొదలు, ప్రజలకిచ్చిన అన్ని వాగ్దానాలనూ గాలికొదిలేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏం సాధించారని వంద రోజులు పండు గు జరుపుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ రాజకీయవ్యవహారాల మండలి సభ్యుడు అంబటి రాంబాబు ప్రశ్నించారు. తాము అడుగుతున్న ఈ ప్రశ్నకు సమాధానం తమకు చెప్పకపోయినా రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాల యంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

మంగళవారంతో చంద్రబాబు వంద రోజు ల పాలన పూర్తవుతోందని టీడీపీ వాళ్లు చెబుతున్నారని, కానీ తమ లెక్క ప్రకారం చంద్రబాబు ఎన్నికల్లో గెలిచి నాలుగు నెలలు పూర్తయిందని, ఆయనే ఆలస్యంగా ప్రమాణ స్వీకారం చేశారని చెప్పారు. సినిమా హిట్టయితే వంద రోజుల పండుగ జరుపుకోవడం సినిమా రంగంలో ఆనవాయితీ అని కానీ రాష్ట్రంలో చంద్రబాబు పాల న ‘ఫట్’ అయినా కూడా బాబు పాలన బ్రహ్మాం డం అని హోరెత్తిస్తుండటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ప్రమాణస్వీకారానికి ముందే పోలవరం సాధించినట్లు ప్రకటనల్లో పేర్కొనడాన్ని అంబటి ప్రశ్నిస్తూ ‘పోలవరాన్ని చంద్రబాబు సాధించారా! హవ్వ... పోలవరం ఎవరు రూపకల్పన చేశారో... ఎవరు సాధించారో, దాని కోసం ఎవరు తాపత్రయపడ్డారో అనేది జగమెరిగిన సత్యం’. బాబు పాలన మొత్తం ‘మనీ’ మర్డర్లు, మేనిపులేషన్, మీడియా మేనేజ్‌మెంట్ చేయడమే ఫిలాసఫీగా మారిందని దుయ్యబట్టారు. ఇంకా ఆయనేమన్నారంటే...

చంద్రబాబు ఈ వంద రోజుల్లో ఒక్క వాగ్దా నం కూడా నెరవేర్చకుండా అబద్ధాల పాలన సాగిస్తున్నారు. టీడీపీ మేనిఫెస్టోలో 200 వాగ్దానాలు, పాదయాత్ర సందర్భంగా 300 మొత్తం 500 వాగ్దానాలు చేశారని వీటిలో ఏ ఒక్కటీ ఆయన నెరవేర్చలేకపోయారు.

తొలి రోజే ఐదు కీలకమైన అంశాలపై చంద్రబాబు సంతకాలు చేశారని చెప్పుకుంటున్నారని, మరి సంతకాల ప్రకారం వాగ్దానాలు అమలు జరిగాయా? తాను అధికారంలోకి వస్తే రైతులు రుణాలు కట్టక్కర లేదన్నారు, మరి ఇపుడు రుణాలు రద్దయ్యాయా? ఆర్బీఐ ఒప్పుకోలేదని రుణమాఫీ ఎగ్గొట్టింది కాక పచ్చి అబద్ధాలు ఎందుకు చెబుతున్నారు? అని దుయ్యాబట్టారు.

బాబు వచ్చాక విద్యుత్ వెలుగులు వచ్చాయ ని మరో అబద్ధం చెప్పారు. ఆర్టీపీపీ (220 మెగావాట్లు)తో సహా పలు థర్మల్ కేంద్రాలు బొగ్గు కొరతవల్ల మూత పడుతుంటే రాష్ట్రంలో విద్యుత్ వెలుగులున్నాయని చెప్పుకుంటారా? రాష్ట్రంలో 24 గంటల కరెంటు సరఫరా, 365 రోజుల పాటు కరెంటు ఇవ్వడం అనేది  మోడీ ప్రభుత్వ నిర్ణయం వల్ల సాధ్యమైతే దానిని కూడా తన ఘనతగా బాబు చెప్పుకుంటున్నారు.

పెంచుతానన్న వృద్ధాప్య పెన్షన్లు ఇప్పటికీ పంపిణీ చేయలేదు. ప్రభుత్వోద్యోగులకు మాత్ర మే 58 నుంచి 60 ఏళ్లకు వయో పరిమితి పెంపు వర్తింపజేసి విద్యుత్, ఆర్టీసీ వంటి 44 ప్రభుత్వ రంగ సంస్థల  ఉద్యోగులను గాలికి వదిలేశారు.

బెల్ట్ షాపుల రద్దు పేరుతో చేసిన సంతకం అమలు కాలేదు. రాష్ట్రంలో నిజంగా బెల్ట్ షాపులు రద్దు అయితే మద్యం అమ్మకాలు ఇంకా ఎలా పెరుగుతాయి? బడ్జెట్‌లో ప్రణాళికా వ్యయం 35 శాతం వరకూ ఉండగా దానిని బాగా తగ్గించారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు తీరని ద్రోహం చేసినట్లే.

రాజధాని ఎంపిక కోసం కేంద్ర కమిటీ పర్యటిస్తూ ఉండగానే ఫలానా చోట రాజధాని అని ప్రకటించేశారు. విజయవాడను రాజధానిగా ఎంపిక చేయడం మంచి నిర్ణయమే అయినప్పటికీ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలతో చర్చిం చి వారిని సంతృప్తిపర్చకుండా అహంకారంతో బాబు ప్రకటన చేయడాన్ని ప్రశ్నిస్తున్నాం.

రాజధాని పెట్టే చోట చంద్రబాబు తాబేదార్లు, సుజనా చౌదరి, దేవినేని ఉమా మహేశ్వరరావు, సి.ఎం.రమేష్ పెద్ద ఎత్తున భూములు కొనేశారు. భవిష్యత్‌లో వారి పేర్లతోనే నారా నగర్, దేవినేని నగర్, సుజనా నగర్ వంటివి వెలియడానికి దోహదం చేస్తున్నారు.

వంద రోజుల పాలనలో స్థానిక సంస్థల్లో నయాన, భయాన ఎంపీటీసీ, జడ్పీటీసీలను లొంగదీసుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. సాక్షాత్తూ స్పీకర్ నియోజకవర్గంలోనే దౌర్జన్యం చేసి ఎంపీటీసీలను లోబర్చుకున్నారు. అనేక చోట్ల వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను, నాయకులను దారుణంగా హత్య చేశారు.
 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement