హోదాలాగే రైల్వే జోన్‌ ఎగ్గొట్టేందుకు కుట్ర | YSRCP leaders comments on Vishakha Railway Zone | Sakshi
Sakshi News home page

హోదాలాగే రైల్వే జోన్‌ ఎగ్గొట్టేందుకు కుట్ర

Published Fri, Mar 31 2017 1:47 AM | Last Updated on Tue, May 29 2018 4:37 PM

హోదాలాగే రైల్వే జోన్‌ ఎగ్గొట్టేందుకు కుట్ర - Sakshi

హోదాలాగే రైల్వే జోన్‌ ఎగ్గొట్టేందుకు కుట్ర

ఆత్మగౌరవ యాత్ర సభలో మాజీ మంత్రులు బొత్స, ధర్మాన

సాక్షి, విశాఖపట్నం: ప్రత్యేక హోదా మాదిరిగానే విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటు హామీని కూడా గాలికొదిలేయాలని చూస్తే మాత్రం చూస్తూ ఊరుకునే ప్రసక్తేలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. విశాఖకు ప్రత్యేక రైల్వేజోన్‌ సాధన కోసం వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ అనకాపల్లి నుంచి భీమిలి వరకు తలపెట్టిన ఆత్మగౌరవ పాదయాత్ర గురువారం అనకాపల్లి నెహ్రూచౌక్‌ వద్ద శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా నాలుగురోడ్ల జంక్షన్‌లో జరిగిన భారీ బహిరంగసభలో మాజీ మంత్రి బొత్స మాట్లాడారు.  ఏప్రిల్‌ 9న తగరపువలస వద్ద జరిగే ముగింపుసభలో పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ పాల్గొంటారని బొత్స తెలిపారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌ కోసం మన తరపున ఒత్తిడి చేయాల్సిన సీఎంఆ ఊసెత్తక పోవడం వల్లే ఈ ఉద్యమం చేయాల్సి వస్తోందని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు.  అవసరమైతే తన తలను రైలుపట్టాల కింద పెట్టయినా రైల్వే జోన్‌ సాధిస్తానని అమర్‌నాథ్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement