పాలకొల్లు: పశ్చిమగోదావరి జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించరాదని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఆదివారం ఆందోళన చేపట్టారు.
పాలకొల్లు పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా వైఎస్ఆర్ విగ్రహం ఉన్న ప్రాంతాన్ని కూడా అధికారులు మార్కింగ్ చేశారు. కూల్చివేత పనులు ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. దీంతో వైఎస్సార్‌సీపీ నేత ఎమ్మెల్సీ శేషుబాబు ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఆదివారం రాత్రి ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాలని నాయకులు నిర్ణయించారు.