
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కరోనా వైరస్ ప్రభావంతో విపత్కర పరిస్థితుల్లో ఉన్నామని.. ఇలాంటి సమయంలో ఎటువంటి సాయం అందించని వ్యక్తి ప్రతిపక్ష నేత చంద్రబాబేనని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా విపత్తులో దేశవ్యాప్తంగా దిగువ స్థాయి నుంచి ప్రధానమంత్రి వరకు తమ వంతు సాయం అందిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో విలాసవంతమైన జీవితం గడుపుతున్నారని దుయ్యబట్టారు.
(‘ఆ పిచ్చే 23 సీట్లకు పరిమితం చేసింది’)
కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలని అడిగే నైతికత టీడీపీకి లేదన్నారు. రాష్ట్రంపై చంద్రబాబు 2 లక్షల 50 వేల కోట్లు అప్పుల కుంపటి పెట్టారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజలు కరోనాతో మృతి చెందాలని చంద్రబాబు కోరుకుంటున్నారని విమర్శించారు. కరోనా సమయంలో కూడా రాజకీయంగా లబ్ధి పొందాలని ఆయన నీచ రాజకీయాలు చేస్తున్నారని శివప్రసాద్‌రెడ్డి మండిపడ్డారు.