
సాక్షి, న్యూఢిల్లీ : అత్యాచార ఘటనల్లో నిందితులకు శిక్ష పడిన తర్వాత.. మళ్లీ కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వకూడదని వైఎస్సార్‌సీపీ ఎంపీ బాలశౌరి అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. చిన్నారులు, మహిళలపై అత్యాచార ఘటనల్లో దోషులకు క్షమాభిక్ష కోరకుండా చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేశారు. మద్య నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాల తరహాలోనే.. అన్ని రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. మద్యం దుకాణల సంఖ్య తగ్గించాలని, బార్ల లైసెన్సులు రద్దు చేయాలని.. రాత్రి 8 గంటల తరువాత మద్యం అమ్మకాలు నిలిపివేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment