సాక్షి, హైదరాబాద్ : పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన విభజన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా వైఎస్సార్ సీపీ మరో అడుగు ముందుకు వేసింది. ఈ నెల 14న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవంగా చేపట్టాలని తీర్మానించింది. ఈ మేరకు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయడంలో కేంద్రం దారణంగా విఫలమైందని.. వీటికి నిరసనగా ఈ నెల 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం జరపాలని తీర్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment