శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరఋతువు, ఫాల్గుణ మాసం, తిథి బ.పంచమి ప.12.34 వరకు తదుపరి, షష్ఠి, నక్షత్రం విశాఖ రా.6.20 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం రా.10.10 నుంచి 11.44 వరకుదుర్ముహూర్తం ఉ.6.54 నుంచి 7.47 వరకుఅమృతఘడియలు... ఉ.10.03 నుంచి 11.43 వరకు.
సూర్యోదయం : 6.13
సూర్యాస్తమయం : 6.05
రాహుకాలం : ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం : ప.1.30 నుంచి 3.00 వరకు
భవిష్యం
మేషం: అప్రయత్న కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో అనుకూలం.
వృషభం: ఇంటర్వ్యూలు అందుకుంటారు. శ్రమ ఫలిస్తుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆప్తుల ద్వారా కీలక సమాచారం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
మిథునం: ముఖ్య కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువిరోధాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.
కర్కాటకం: మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.
సింహం: వ్యవహారాలలో పురోగతి. కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
కన్య: రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
తుల: బంధువులతో వివాదాలు. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. పనులలో తొందరపాటు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.
వృశ్చికం: రాబడికి మించిన ఖర్చులు. వ్యయప్రయాసలు. మిత్రులు, బంధువులతో తగాదాలు. స్వల్ప అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగించవచ్చు.
ధనుస్సు: ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలలో పురోగతి. కొన్ని వివాదాలు తీరతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగానే సాగుతాయి.
మకరం: కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.
కుంభం: పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. కొత్త పరిచయాలు. సంఘంలో గౌరవం. వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
మీనం: కుటుంబంలో కలహాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.– సింహంభట్ల సుబ్బారావు
Comments
Please login to add a commentAdd a comment