శ్రీ వికారినామ సంవత్సరం. ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఫాల్గుణ మాసం. తిథి బ.చతుర్దశి ఉ.11.48 వరకు, తదుపరి అమావాస్య. నక్షత్రం పూర్వాభాద్ర రా.12.40 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర. వర్జ్యం లేదు. దుర్ముహూర్తం ప.12.30 నుంచి 1.18 వరకు, తదుపరి ప.2.54 నుంచి 3.41 వరకు. అమృత ఘడియలు ప.3.54 నుంచి 4.43 వరకు.
సూర్యోదయం: 6.06
సూర్యాస్తమయం: 6.07
రాహుకాలం : ఉ.7.30 నుంచి 9.00 వరకు.
యమగండం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
భవిష్యం
మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. పనులలో విజయం. తీర్థయాత్రలు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
వృషభం: ఇంటాబయటా అనుకూలత. కాంట్రాక్టులు దక్కుతాయి. పరిచయా లు పెరుగుతాయి. సంఘంలో మరింత గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
మిథునం: కొన్ని పనులలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధుమిత్రులతో స్వల్ప విభేదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొం టారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.
కర్కాటకం: వ్యవహారాలు మందగిస్తాయి. దూరప్రయాణాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. మిత్రులతో విభేదాలు. పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
సింహం: నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు సజావుగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు. విందువినోదాలు.
కన్య: దూరపు బంధువుల కలయిక. పనులు సజావుగా సాగుతాయి. వాహనయోగం. ప్రముఖులతో చర్చలు సఫలం. వ్యాపారాలలో పెట్టుబడులందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.
తుల: వ్యవహారాలలో ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబసమస్యలు ఎదురుకావచ్చు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజకనంగా ఉంటాయి. కళాకారులకు ఒత్తిడులు.
వృశ్చికం: పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆలోచనలు కలసిరావు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
ధనుస్సు: కార్యసిద్ధి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వాహనయోగం. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు. కళాకారులకు సత్కారాలు.
మకరం: పనులు కొన్ని వాయిదా పడతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. కుటుంబ సభ్యులతో తగాదాలు. వ్యాపారాలు చికాకు పరుస్తాయి.
కుంభం: పలుకుబడి పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. సంఘంలో ఆదరణ. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. వాహనయోగం. ఉద్యోగాలలో పురోగతి.
మీనం: ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రమే. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. కళాకారులకు శ్రమాధిక్యం.
– సింహంభట్ల సుబ్బారావు
Comments
Please login to add a commentAdd a comment