
న్యూయార్క్: పలు దేశాల్లో నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్యాక్సీ సేవల సంస్థ ఉబెర్ తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ప్రపంచవ్యాప్తంగా 5.7 కోట్ల మంది ఉబెర్ కస్టమర్ల పేర్లు, ఈ మెయిల్ అడ్రెస్‌లు, ఫోన్ నంబర్లు మొదలైనవి హ్యాకింగ్‌కి గురవడం వెలుగులోకి వచ్చింది. అలాగే 6 లక్షలమంది అమెరికన్ డ్రైవర్ల లైసెన్సుల నంబర్లతో పాటు మొత్తం 70 లక్షల మంది డ్రైవర్ల వ్యక్తిగత సమాచారం కూడా చోరీకి గురైనట్లు వెల్లడైంది. అయితే, హ్యాకింగ్ గత సంవత్సరం అక్టోబర్‌లోనే జరిగినప్పటికీ.. కంపెనీ ఏడాదిపైగా ఈ విషయం బైటికి రాకుండా జాగ్రత్తపడింది.
తస్కరించిన డేటాను డిలీట్ చేసేందుకు, విషయం బైటికి తెలియకుండా చూసేందుకు హ్యాకర్లకు ఉబెర్ సుమారు 1,00,000 డాలర్లు కూడా చెల్లించింది. ఉబెర్ స్వయంగా ఈ విషయాలు వెల్లడించిన నేపథ్యంలో డేటా హ్యాకింగ్‌పై న్యూయార్క్ అటార్నీ జనరల్ విచారణ జరుపుతున్నారు. అయితే, డేటా దుర్వినియోగమేమీ జరగలేదని, ఇకపై ఇలాంటివి జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీఈవోగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన దారా ఖుస్రోవ్‌షాహీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment