ఈ ఏడాదిలో 10 హమ్దర్ద్ వెల్నెస్ సెంటర్లు | 10 humdurd wellness centers in hyderabad | Sakshi
Sakshi News home page

ఈ ఏడాదిలో 10 హమ్దర్ద్ వెల్నెస్ సెంటర్లు

Jul 22 2016 1:13 AM | Updated on Oct 9 2018 7:52 PM

ఈ ఏడాదిలో 10 హమ్దర్ద్ వెల్నెస్ సెంటర్లు - Sakshi

ఈ ఏడాదిలో 10 హమ్దర్ద్ వెల్నెస్ సెంటర్లు

ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో యునానీకి సంబంధించి ఈ సంవత్సరం పది వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు హమ్‌దర్ద్ ఇండియా

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రత్యామ్నాయ వైద్య విధానాలు ప్రాచుర్యంలోకి వస్తున్న నేపథ్యంలో యునానీకి సంబంధించి ఈ సంవత్సరం పది వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు హమ్‌దర్ద్ ఇండియా చీఫ్ మార్కెటింగ్ అండ్ సేల్స్ ఆఫీసర్ మన్సూర్ అలీ వెల్లడించారు. ప్రస్తుతం ఢిల్లీలో 4, పాట్నాలో ఒకటి  ఉన్నట్లు చెప్పారాయన. గురువారం హైదరాబాద్‌లో మరో వెల్‌నెస్ సెంటర్‌ను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మొహమ్మద్ మహమూద్ అలీ ప్రారంభించారు.

ఒక్కో సెంటర్ ఏర్పాటుకు సుమారు రూ. 40-50 లక్షల దాకా వెచ్చిస్తున్నట్లు మన్సూర్ చెప్పారు. లైఫ్ స్టయిల్ మార్పులు, ఇతరత్రా కారణాలతోనూ వచ్చే ఆరోగ్య సమస్యలకు అందుబాటు ధరలో యునానీ  చికిత్స అందించే ఉద్దేశంతో ఈ వెల్‌నెస్ సెంటర్లు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తమ టర్నోవరు రూ.600 కోట్ల పైనే ఉండగా.. ఎగుమతుల వాటా 4-5%గా ఉంటోందన్నారు. 3 తయారీ ప్లాంట్లు, 500 పైగా ఉత్పత్తులు ఉండగా.. ఆదాయాల్లో 20% వృద్ధి అంచనా వేస్తున్నట్లు చెప్పారు. రూహ్ అఫ్జా, సాఫీ, సింకారా వంటి ఉత్పత్తులను హమ్‌దర్ద్ విక్రయిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement