ఫోర్బ్స్ మిదాస్ లిస్ట్‌లో 11 మంది భారత-అమెరికన్‌లు | 11 Indian-Americans in Forbes Midas' best venture investors | Sakshi
Sakshi News home page

ఫోర్బ్స్ మిదాస్ లిస్ట్‌లో 11 మంది భారత-అమెరికన్‌లు

Mar 28 2014 1:36 AM | Updated on Oct 4 2018 4:43 PM

ఫోర్బ్స్ మిదాస్ లిస్ట్‌లో 11 మంది భారత-అమెరికన్‌లు - Sakshi

ఫోర్బ్స్ మిదాస్ లిస్ట్‌లో 11 మంది భారత-అమెరికన్‌లు

ఫోర్బ్స్ మ్యాగజైన్ వంద ఉత్తమ వెంచర్ ఇన్వెస్టర్ల వార్షిక జాబితాలో 11 మంది భారత-అమెరికన్‌లకు చోటు దక్కింది. వీరంతా స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టి, ఆ తర్వాత తమ వాటాలను భారీ లాభాలకు అమ్మేశారని ఫోర్బ్స్ వివరించింది.

న్యూయార్క్: ఫోర్బ్స్ మ్యాగజైన్  వంద ఉత్తమ వెంచర్ ఇన్వెస్టర్ల వార్షిక జాబితాలో 11 మంది భారత-అమెరికన్‌లకు చోటు దక్కింది.  వీరంతా స్టార్టప్‌ల్లో పెట్టుబడులు పెట్టి, ఆ తర్వాత తమ వాటాలను భారీ లాభాలకు అమ్మేశారని ఫోర్బ్స్ వివరించింది.

మిదాస్ లిస్ట్ పేరుతో ఈ జాబితాను మ్యాగజైన్ రూపొందించింది. ముఖ్యాంశాలు...
ఈ జాబితాలో సిక్వియా క్యాపిటల్ భాగస్వామి జిమ్ గోయెట్జ్ అగ్రస్థానంలో నిలిచారు. క్లౌడ్ ఆధారిత ఆర్థిక సేవలు, మానవ వనరుల సాఫ్ట్‌వేర్ సంస్థ, వర్క్‌డేకు  కో-చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న భారత-అమెరికన్ అనీల్ భూస్రీ 17వ స్థానంలో నిలిచారు.

ట్విట్టర్, మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ టంబ్లర్, పర్సనలైజ్‌డ్ మ్యాగజైన్ ఫ్లిప్‌బోర్డ్‌లో ఇన్వెస్ట్ చేసిన ఇన్‌సైట్ వెంచర్ పార్ట్‌నర్స్ ఎండీ దేవన్ పరేఖ్ 22వ స్థానాన్ని సాధించారు.

ఇంకా ఈ జాబితాలో చోటు సాధించిన ఇతర భారత-అమెరికన్‌లు.. ప్రమోద్ హాకే(27వ స్థానం), నవీన్ చద్దా(30), నీరజ్ అగర్వాల్(37), సమీర్ గాంధీ(41), అషీమ్ చందన(55), వెంకీ గణేశన్(57), వినోద్ ఖోస్లా(63), సలీల్ దేశ్‌పాండే(67), గౌరవ్ గార్గ్(86).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement