2020 నాటికి 600 కోట్లకు ప్రపంచ స్మార్ట్‌ఫోన్ యూజర్లు!
న్యూఢిల్లీ: టెలికం పరిశ్రమ వృద్ధి కారణంగా స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య గణనీయంగా పెరగ నున్నది. అంతర్జాతీయంగా 2020 నాటికి వీరి సంఖ్య 600 కోట్లకు పైగా చేరుతుందని చైనా వెబ్ సర్వీసెస్ సంస్థ బైదు తన నివేదికలో పేర్కొంది. దీని ప్రకారం.. స్మార్ట్‌ఫోన్స్‌ను 60% మంది కమ్యూనికేషన్ కోసం, 23% మంది వారి తోడు కోసం, 8% సామాజిక మాధ్యమాల వినియోగం కోసం, 9% ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వినియోగిస్తున్నారు. 20 ఏళ్లు, అంతకు దిగువ వయసు వారు స్మార్ట్‌ఫోన్స్‌ను మ్యూజిక్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఉపయోగిస్తున్నారు.