ఫార్మా పరిశ్రమకు 500 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్!
న్యూఢిల్లీ : దేశీ ఫార్మా పరిశ్రమను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ ఫండ్ ద్వారా కేంద్రం మౌలిక వసతుల ఏర్పాటు కోసం కంపెనీలకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలను అందించనుంది. ఔషధాల ఆమోదానికి సింగిల్ విండో పద్ధతి, ప్రజలకు ఎక్కువ ఔషధాలను అందుబాటులోకి తీసుకురావడం తదితర ప్రతిపాదనలపై కేంద్రం కసరత్తు చేస్తోంది.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ (డీఓపీ) ఆధ్వర్యంలో ఏర్పాటైన టాస్క్‌ఫోర్స్ కమిటీ గతవారం ఫార్మా పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన ఒక నివేదికను రసాయనాలు-ఎరువుల శాఖ మంత్రి అనంత్ కుమార్‌కు అందించింది. ఇతర ఆర్థిక సంస్థలతో కలిసి చిన్న, మధ్యతరహా ఫార్మా కంపెనీల వృద్ధికి డీఓపీ నిధులను అందించాలని టాస్క్‌ఫోర్స్ తన నివేదికలో సూచించింది.