భారత్‌లో విద్యుత్ నుంచి పోర్ట్‌ల వరకూ బిజినెస్‌లు కలిగిన అదానీ గ్రూప్ ఆస్ట్రేలియాలో 15.5 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 93,000 కోట్లు) విలువైన ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది.
బొగ్గు గని అభివృద్ధి, రైల్వే లైన్ ఏర్పాటు
మెల్‌బోర్న్: భారత్‌లో విద్యుత్ నుంచి పోర్ట్‌ల వరకూ బిజినెస్‌లు కలిగిన అదానీ గ్రూప్ ఆస్ట్రేలియాలో 15.5 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 93,000 కోట్లు) విలువైన ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది. క్వీన్స్‌లాండ్‌లోని కార్మిచేల్ బొగ్గు గని నిర్వహణతోపాటు, గలీలీ బేసిన్‌లో రైల్వే లైను నిర్మాణానికి సంబంధించి ఈ ప్రాజెక్ట్‌ను పొందింది. ఇది ప్రపంచంలోని ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. కార్మిచేల్ మైనింగ్ ద్వారా విద్యుత్ తయారీకి వినియోగించే బొగ్గు ఉత్పత్తి అవుతుంది. ఏడాదికి 60 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని కలిగి ఉంది. దీనికి అనుబంధంగా 189 కిలోమీటర్లమేర రైల్వే లైనును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.