
ఉద్యోగులకు ఇన్ఫోసిస్ షాక్
బెంగుళూరు: భారత్‌లో కీలక ఐటీ కంపెనీలు వరుస పెట్టి ఉద్యోగులకు షాక్ ఇస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ఇన్ఫోసిస్ వచ్చి చేరింది. వందల మంది ఉద్యోగులను ఇన్ఫీ తొలగించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పనితీరును సమీక్షిస్తున్న ఇన్ఫోసిస్ త్వరలోనే ఉద్యోగులను తొలగించనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
కంపెనీ ప్రమాణాలను అందుకోని ఉద్యోగులందరినీ తొలగించాలని ఇన్ఫీ యోచిస్తున్నట్లు తెలిసింది. తొలగింపుకు గురవనున్న వారిలో ఎక్కువగా గ్రూప్ ప్రాజెక్టు మేనేజర్లు, సీనియర్లు ఉన్నట్లు కొందరు తెలిపారు. కాగా, గత వారం కాగ్నిజెంట్, విప్రోలు ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 10 నుంచి 20 ఏళ్లు సర్వీసు ఉన్న సీనియర్ ఉద్యోగులే లక్ష్యంగా ఇన్ఫీ తొలగింపు కార్యక్రమం చేపడుతున్నట్లు తెలుస్తోంది.