
ఈ నెలలో సత్య నాదెళ్ల పర్యటన
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఈ నెలలో భారత్‌లో పర్యటించే అవకాశముంది.
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఈ నెలలో భారత్‌లో పర్యటించే అవకాశముంది. పర్యటనలో భాగంగా ఆయన కొందరు ఎంట్రప్రెన్యూర్లను, యాప్ డెవలపర్లను కలుసుకోనున్నారు. అలాగే ఈయన మైక్రోసాఫ్ట్ కంపెనీ మే 30న నిర్వహించనున్న ఒక కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. దేశంలోని సమస్యల పరిష్కారానికి కావలసిన ఆవిష్కరణల వేగవంతానికి టెక్నాలజీ ఎలా దోహదపడుతుందనే అంశంపై మాట్లాడతారని సమాచారం. యాపిల్ సీఈవో టిమ్ కుక్ పర్యటన అనంతరం నాదెళ్ల భారత్‌కు రానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.