రూ. 200 కోట్ల సమీకరణలో అపోలో హాస్పిటల్స్ | apollo hospitals 200crore equation | Sakshi
Sakshi News home page

రూ. 200 కోట్ల సమీకరణలో అపోలో హాస్పిటల్స్

Published Wed, Oct 5 2016 1:32 AM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

రూ. 200 కోట్ల సమీకరణలో అపోలో హాస్పిటల్స్

రూ. 200 కోట్ల సమీకరణలో అపోలో హాస్పిటల్స్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్స్ జారీ ద్వారా రూ. 200 కోట్లు సమీకరించనున్నట్లు అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజ్ వెల్లడించింది. రూ. 10 లక్షల ముఖ విలువ గల ఎన్‌సీడీల జారీకి కంపెనీ బోర్డు కమిటీ ఆమోదముద్ర వేసినట్లు వివరించింది. ఓవర్ సబ్‌స్క్రిప్షన్ పరిస్థితుల్లో అదనంగా రూ. 100 కోట్లు అట్టే పెట్టుకునే విధంగా గ్రీన్‌షూ ఆప్షన్‌తో ఎన్‌సీడీల జారీ ఉండగలదని పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్ 7 నుంచి పదేళ్ల కాలవ్యవధితో వీటిని జారీ చేయనుంది. మంగళవారం అపోలో హాస్పిటల్స్ షేరు స్వల్పంగా తగ్గి రూ. 1,353 వద్ద ముగిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement