equation
-
పంజాబ్ ‘సర్దార్’ ఎవరు? ఏ పార్టీకి ఎంత బలముంది?
దేశంలో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఆరు విడతల పోలింగ్ ముగియగా, ఇంకా ఏడవ, చివరి దశ ఓటింగ్ జూన్ ఒకటిన జరగాల్సివుంది. కాగా పంజాబ్‌లో లోక్‌సభ ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ రాష్ట్రంలోని 13 లోక్‌సభ స్థానాలున్నాయి. ఇక్కడ చతుర్ముఖ పోటీ నెలకొంది.పంజాబ్‌లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, అకాలీదళ్, బీజేపీ మధ్య పోటీ కనిపిస్తోంది. రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో చూపిన సత్తాను పునరావృతం చేస్తుందా? లేక గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ చూపిన పనితీరు మరోసారి పునరావృతం అవుతుందా అనే దానిపై చర్చ జరుగుతోంది. పంజాబ్‌లోని ఆరు హాట్ సీట్లలో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు?అమృత్సర్: ఈ లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో హాట్సీట్లుగా పరిగణిస్తున్న స్థానాల్లో అమృత్సర్ మొదటి స్థానంలో నిలిచింది. అమృత్‌సర్‌లో ఆల్ రౌండ్ పోటీ నెలకొంది. 1989 ఎన్నికల తర్వాత తొలిసారిగా పంజాబ్‌లో ఇటువంటి పోటీ కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో సిక్కుయేతర ఓట్లపై బీజేపీ దృష్టి సారించింది. అమృత్‌సర్‌లో హిందువుల జనాభా నిర్ణయాత్మక రీతిలోనే ఉంది.పటియాలా: ఈసారి పటియాలాలో జరిగే ఎన్నికలు ఉత్కంఠగా మారాయి. రెండు సార్లు కాంగ్రెస్ టిక్కెట్‌పై విజయం సాధించిన ప్రణీత్ కౌర్ ఇప్పుడు బీజేపీలో చేరారు. ఒకసారి ఆమ్ ఆద్మీ పార్టీ టిక్కెట్‌పై గెలిచిన ధరమ్వీర్ గాంధీ కాంగ్రెస్‌లో చేరారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ బీజేపీలోనే ఉన్నారు. అయితే అమరీందర్ సింగ్ ఈ సారి గడ్డు పరిస్థితులను ఎదుర్కోనున్నారని విశ్లేషకులు అంటున్నారు.జలంధర్: ఈ లోక్‌సభ స్థానంలో హిందువుల జనాభా 40 శాతానికి పైగా ఉంది. ఈ జనాభాపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, గత సారి ఆమ్ ఆమ్ ఆద్మీ పార్టీపై మొగ్గు చూపిన ఓటర్లు ఈసారి బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తారా? అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. భటిండా: గత మూడు ఎన్నికల్లో అకాలీదళ్‌కు చెందిన హర్సిమ్రత్ కౌర్ గెలుపొందారు. అయితే ఈసారి సమీకరణలు మారిపోయాయి. అకాలీదళ్‌పై విశ్వసనీయత గణనీయంగా తగ్గిపోయిందంటున్నారు. బీజేపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోరాటానికి పూర్తిగా సిద్ధమైంది.లూథియానా: గత మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 2014, 2019 ఎన్నికల్లో గెలిచిన రవ్నీత్ సింగ్ బిట్టు ఢిల్లీకి ప్రమోట్ అయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో సమీకరణలు మారాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా రవ్నీత్ సింగ్ బిట్టు బరిలోకి దిగారు. లూథియానాలో కూడా, హిందూ ఓటు బ్యాంకు, రవ్నీత్ సింగ్ బిట్టు ఓటు బేస్ సహాయంతో ఎన్నికల్లో గెలవాలని బీజేపీ కోరుకుంటోంది. గురుదాస్‌పూర్: గత రెండు దఫాల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో సినీ తారలను బీజేపీ బరిలోకి దించలేదు. గురుదాస్‌పూర్ సీటును నిలబెట్టుకునేందుకు నటుడు సన్నీ డియోల్ అభివృద్ధి కార్యక్రమాలేవీ చేపట్టలేదు.పంజాబ్‌లో ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే రాజకీయాలు నడుస్తాయి. 2014లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓటింగ్ జరగ్గా ఎన్డీఏకు ఎక్కువ సీట్లు వచ్చాయి. 2019లో ఎన్డీఏ ఓడిపోయి కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వచ్చాయి. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో అన్నివైపుల నుంచి పోటీ నెలకొంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ నుంచే కాకుండా ఆమ్ ఆద్మీ నుంచి కూడా విపరీతమైన పోటీ ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సీట్లు తగ్గే అవకాశం ఉంది. పంజాబ్ రాష్ట్రంలో 58 శాతం సిక్కు జనాభా, 38 శాతం హిందూ జనాభా, 32 శాతం దళిత జనాభా ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పంజాబ్‌లో రాజకీయాలు భిన్నంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. -
TS Elections 2023: తెలంగాణలో కమ్మలకు, వెలమలకు చెడిందా?
రాజకీయాల్లో కుల సమీకరణాల పాత్ర చాలా కీలకం. ఓటు బ్యాంకును నిర్ణయించేది, ఎన్నికల్లో గెలిపించేది కులమే అని నమ్ముతారు. తెలంగాణ ఎన్నికలకు కొద్ది ముందు కమ్మ సామాజిక వర్గం విడుదల చేసిన ఓ ప్రెస్ నోట్ ఇప్పుడు ఆసక్తికరమైన అంశాలపై చర్చకు దారి తీసింది. మొన్నటి బీఆర్ఎస్ టికెట్ల పంపిణీలో వెలమ అభ్యర్థులకు 11 టికెట్లు దక్కగా, కమ్మ సామాజిక వర్గానికి 5 టికెట్లు దక్కాయి. అయితే ఆర్థికంగా బలంగా ఉన్న తాము, చాలా ప్రాంతాలతో పాటు ఇతర వర్గాలపైనా ప్రభావం చూపిస్తామని నమ్ముతున్న కమ్మలు తమకు 5 సీట్లు సరిపోవన్న అసంతృప్తిలో ఉన్నారు మాకు మీరు.. మీకు మేం తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్ వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు. కెసిఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీకి ముందు నుంచి కమ్మ సామాజిక వర్గం నుంచి మద్ధతు ఉంది. హైదరాబాద్, ఖమ్మంలో ఈ సామాజిక వర్గంకు ఉన్న ఓటు బ్యాంకుతో పాటు వీరు ప్రభావితం చేసే ఓట్లను గంపగుత్తగా బీఆర్ఎస్కు పడేవి. ఇటీవల సీఎం కెసిఆర్ ప్రకటించిన జాబితాలో టికెట్లు దక్కించుకున్న కమ్మలు జూబ్లీహిల్స్ - మాగంటి గోపినాథ్ శేరిలింగంపల్లి - అరికెపూడి గాంధీ సిర్పూర్ - కోనేరు కోనప్ప ఖమ్మం - పువ్వాడ అజయ్‌కుమార్ మిర్యాలగూడ - నల్లమోతు భాస్కరరావు (రేవంత్, మాణిక్కం ఠాగూర్ ను కలిసిన తర్వాత గాంధీభవన్ ముందు కమ్మ నేతలు) తుమ్మల, జలగం ఇద్దరికీ షాక్ ఇప్పుడు ఆ సమీకరణాల్లో తేడా కొట్టిందని కొన్ని పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఇటీవలే బీఆర్ఎస్ తమ అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ఎక్కువ మంది సిట్టింగ్‌లకే టికెట్లు వచ్చాయి. పైగా 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయిన ఇద్దరు ముఖ్యమైన కమ్మ నేతలకు టికెట్ ఈ సారి దక్కలేదు. పాలేరు నుంచి టికెట్ ఆశించిన తుమ్మల నాగేశ్వరరావు నిరాశకు గురి కాగా.. పోటీ చేసే అవకాశం పార్టీ ఇవ్వలేదు. ఇవ్వాళ తుమ్మల కన్నీళ్లు పెడుతూ హైదరాబాద్ నుంచి వెళ్లే దృశ్యాలు ఈ సామాజిక వర్గంలో చర్చనీయాంశమయ్యాయి. (టికెట్ దక్కకపోవడంతో నిరాశకు గురై కన్నీళ్లు పెట్టుకున్న తుమ్మల) కమ్మ @ కిం కర్తవ్యం ఈ పరిణామాలు కమ్మ వర్గంలో కొంత అసంతృప్తి నింపాయి. ఈ మేరకు తెలంగాణ కమ్మ వర్గం ముఖ్యనేతలు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో తీసుకున్న నిర్ణయాలపై చర్చించారు. ఇక మిగిలింది కాంగ్రెస్, బీజేపీ కాబట్టి .. అర్జంట్‌గా రెండు లేఖలు తయారు చేశారు. ఈ రెండు పార్టీలు ప్రకటించబోయే జాబితాలో కమ్మలకు పది ఎమ్మెల్యే టికెట్లు, దీంతో పాటు వచ్చే ఏడాది రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రెండు ఎంపీ టికెట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిని, అలాగే తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డిని కలిసి తమ విజ్ఞప్తులు అందించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ను మాత్రం కలవలేదు. (బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డి కలిసి టికెట్లు ఇవ్వాలని కోరిన కమ్మ నేతలు) చాలా స్ట్రాంగ్ తెలంగాణలో ఆర్థికంగా అత్యంత శక్తిమంతమైన కులాలుగా ఉన్న కమ్మ, వెలమ కులాలు రాజకీయంగా మాత్రం వేర్వేరు స్థాయిల్లో ఉన్నాయి. ఈ రెండు కులాలకు హైదరాబాద్‌లోని ప్రధాన స్థలాల్లో సొంత భవనాలు ఉన్నాయి. అయినప్పటికీ ఆ రెండు కులాలకీ చెరో ఐదెకరాల స్థలాన్ని ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంపై వివాదం చెలరేగింది. ఆ నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆ విషయంలో కూడా కమ్మ సామాజిక వర్గానికి కొంత అసంతృప్తి మిగిలింది. ఓ రకంగా బీఆర్ఎస్ను రెచ్చగొట్టడానికే కమ్మ నాయకులు కాంగ్రెస్, బీజేపీలను కలిశారన్న ప్రచారం జరుగుతోంది. -
అసెట్స్ విక్రయంలో బీఎస్ఎన్ఎల్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అసెట్స్ విక్రయం ద్వారా దాదాపు రూ. 300 కోట్లు సమీకరించడంపై ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నిర్దిష్ట భూములను విక్రయించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తదితర సంస్థలతో చర్చలు జరుపుతోందని టెలికం శాఖ (డాట్) సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బీఎస్ఎన్ఎల్తో పాటు ప్రభుత్వ రంగానికి చెందిన మరో టెల్కో ఎంటీఎన్ఎల్ ప్రవేశపెట్టిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి మంచి స్పందన వచ్చిందని పేర్కొన్నారు. దీనితో బీఎస్ఎన్ఎల్ జీతాల బిల్లు 50శాతం, ఎంటీఎన్ఎల్ బిల్లు 75 శాతం మేర తగ్గుతుందని అధికారి వివరించారు. బాండ్ల ద్వారా సుమారు రూ. 15,000 కోట్లు సమీకరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పూచీకత్తునివ్వనుందని పేర్కొన్నారు. దీనికి ఆర్థిక శాఖ అనుమతులు వస్తే జనవరి లేదా ఫిబ్రవరిలో సమీకరణ జరిపే అవకాశం ఉందని అధికారి చెప్పారు. ఈ నిధులను రుణాల చెల్లింపు, పెట్టుబడుల కోసం వినియోగించనున్నట్లు వివరించారు. -
రూ.18,000 కోట్ల సమీకరణకు యాక్సిస్ బ్యాంకు నిర్ణయం
న్యూఢిల్లీ: యాక్సిస్ బ్యాంకు ఈక్విటీ షేర్ల జారీ, డిపాజిటరీ రిసీట్స్ లేదా కన్వర్టబుల్ డిబెంచర్ల జారీ ద్వారా రూ.18,000 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. సంబంధిత ప్రతిపాదనకు శనివారం నాటి బోర్డు సమావేశంలో ఆమోదం తెలిపినట్టు బ్యాంకు ప్రకటించింది. అయితే, ఎప్పుడు ఈ నిధుల సేకరణ కార్యక్రమం చేపట్టేదీ బ్యాంకు పేర్కొనలేదు. -
రూ. 200 కోట్ల సమీకరణలో అపోలో హాస్పిటల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రైవేట్ ప్లేస్మెంట్ ప్రాతిపదికన నాన్-కన్వర్టబుల్ డిబెంచర్స్ జారీ ద్వారా రూ. 200 కోట్లు సమీకరించనున్నట్లు అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ వెల్లడించింది. రూ. 10 లక్షల ముఖ విలువ గల ఎన్సీడీల జారీకి కంపెనీ బోర్డు కమిటీ ఆమోదముద్ర వేసినట్లు వివరించింది. ఓవర్ సబ్స్క్రిప్షన్ పరిస్థితుల్లో అదనంగా రూ. 100 కోట్లు అట్టే పెట్టుకునే విధంగా గ్రీన్‌షూ ఆప్షన్‌తో ఎన్సీడీల జారీ ఉండగలదని పేర్కొంది. ఈ ఏడాది అక్టోబర్ 7 నుంచి పదేళ్ల కాలవ్యవధితో వీటిని జారీ చేయనుంది. మంగళవారం అపోలో హాస్పిటల్స్ షేరు స్వల్పంగా తగ్గి రూ. 1,353 వద్ద ముగిసింది. -
రూ.11వేల కోట్ల సమీకరణలో ఎస్బీఐ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఎస్బీఐ డెట్ సెక్యూరిటీల జారీ ద్వారా రూ.11వేల కోట్ల రూపాయలను సమీకరించనుంది. ఈ మేరకు టైర్ 1 అదనపు మూల ధనం సమీకరణకు అనుమతిస్తూ బ్యాంకు డెరైక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు ఎస్బీఐ బీఎస్ఈకి సమాచారం అందించింది. బాసెల్-3 కాంప్లియెంట్ డెట్ ఇనుస్ట్రుమెంట్లను డాలర్ లేదా రూపాయిల్లో, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రైవేటు ప్లేస్మెంట్ విధానంలో జారీ చేయడం ద్వారా నిధులు సమీకరించనున్నట్టు ఎస్బీఐ తెలిపింది. -
రూ. 2,500 కోట్ల సమీకరణలో జీఎంఆర్ ఇన్ఫ్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తాజాగా ఈక్విటీ షేర్లు, ఈక్విటీ ఆధారిత సాధనాలు, డిబెంచర్లు మొదలైన వాటి జారీ ద్వారా రూ. 2,500 కోట్ల దాకా సమీకరించనుంది. వచ్చే నెల 14న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ప్రతిపాదనకు షేర్‌హోల్డర్ల అనుమతి కోరనున్నట్లు సంస్థ వెల్లడించింది. దాదాపు రూ. 40,000 కోట్ల పైచిలుకు ఉన్న రుణభారాన్ని తగ్గించుకునే దిశగా జీఎంఆర్ కొన్ని ప్రాజెక్టుల్లో వాటాలు విక్రయిస్తూ వస్తోంది. కొన్నాళ్ల క్రితమే విద్యుత్ విభాగానికి సంబంధించి 30 శాతం వాటాలను మలేషియాకి చెందిన టెనగా నేషనల్‌కి విక్రయించింది. హైదరాబాద్ విమానాశ్రయంలోనూ వాటాలు విక్రయించే ప్రయత్నాల్లో కంపెనీ ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. -
హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ.50వేల కోట్ల సమీకరణ
న్యూఢిల్లీ: అందుబాటు ధరల్లో గృహాలు, మౌలిక వసతుల రంగానికి రుణాలు అందించేందుకు వీలుగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ.50వేల కోట్ల నిధుల సమీకరణకు వాటాదార్ల అనుమతి కోరనుంది. డెట్ ఇనుస్ట్రుమెంట్స్, టైర్-2 కేపిటల్ బాండ్స్, సీనియర్ లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్స్‌ను దేశీయ మార్కెట్లో ప్రైవేటు ప్లేస్మెంట్ విధానంలో జారీ చేయడం ద్వారా రూ.50వేల కోట్లకు మించకుండా నిధులు సేకరించాలని బ్యాంకు డెరైక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకుంది.