సాక్షి, బెంగళూరు: వేలకోట్ల రూపాయల ఎగవేతదారుడు, వ్యాపారవేత్త విజయ్‌మాల్యాపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కేసులో బెంగళూరులోని కంపెనీల చట్టం కింద ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కోర్టు మాల్యాతోపాటు మరో 18మందికి ఈ వారెంట్ ఇష్యూ చేసింది. సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఐఎఫ్ఓఓ) దాఖలు చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు ఈ చర్య తీసుకుంది.
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని దర్యాప్తు సంస్థ, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించి పలు కంపెనీల చట్టాల ఉల్లంఘనలను గుర్తించింది. దీంతోపాటు తీవ్రమైన కార్పొరేట్ పాలన లోపాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసులో చోటుచేసుకున్న అక్రమాల మొత్తం భారీగా ఉండటంతో మాల్యా సహా అందరి నిందితులపై కోర్టు సీరియస్‌గా స్పందించింది. ఈ నేపథ్యంలోనే కంపెనీల చట్టాల ప్రకారం డిఫాల్టర్ వ్యాపారవేత్త విజయ్ మాల్యా, మరో 18 మందికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అంతేకాకుండా, 19 సంస్థలపై "ప్రత్యేక నేర కేసు" నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ, ఈడీ తమ చార్జ్‌షీటులను దాఖలు చేశాయి.
కాగా 9వేలకోట్ల రూపాయల మేర రుణాలను ఎగవేసిన మాల్యా లండన్‌కు పారిపోగా.. ఆయన్ను తిరిగి భారత్‌కు రప్పించేందుకు సంబంధించిన కేసు లండన్ కోర్టు విచారణలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment