బుధవారం ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్ షేర్లు జోరుగా ర్యాలీ చేస్తున్నాయి. మధ్యహ్నాం 2:50 గంటల ప్రాంతంలో నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 2 శాతం లాభపడి రూ.17,857.10 వద్ద ట్రేడ్ అవుతోంది. ఉదయం సెషన్‌లో రూ.17,486.50 వద్ద ప్రారంభమైన బ్యాంక్ నిఫ్టీ రూ.18,002.65 వద్ద గరిష్టాన్ని తాకగా, రూ.17,407.70 వద్ద కనిష్టానికి పడిపోయింది. ఈ ఇండెక్స్‌లో భాగమైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 2.5 శాతం లాభంతో రూ.851.80 వద్ద, ఫెడరల్ బ్యాంక్ 2.4శాతం లాభంతో రూ.39.20 వద్ద, కోటక్ మహీంద్రా బ్యాంక్ 2.4 శాతం లాభంతో రూ.1,158.30 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్ 1.3శాతం నష్టపోయి రూ.359 వద్ద, ఐసీఐసీఐ బ్యాంక్ 1శాతం లాభపడి రూ.303 వద్ద, ఆర్‌బీఎల్ బ్యాంక్ 1శాతం లాభంతో రూ.111 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, పీఎన్‌బీ, ఎస్‌బీఐఎన్‌లు 0.4శాతం లాభంతో ట్రేడ్ అవుతుండగా, ఈ ఇండెక్స్‌లో భాగమైన మరికొన్ని కంపెనీలు మాత్రం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. వీటిలో ఇండస్‌ఇండ్ బ్యాంక్ 3.6 శాతం నష్టపోయి రూ.354.25 వద్ద ,ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌బ్యాంక్, బంధన్ బ్యాంక్‌లు 1 శాతం నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment