బేయర్ చేతికి మోన్ శాంటో...! | Bayer Offers $62 Billion To Acquire Monsanto | Sakshi
Sakshi News home page

బేయర్ చేతికి మోన్ శాంటో...!

May 23 2016 12:54 PM | Updated on Sep 4 2017 12:46 AM

జర్మనీ ఔషధ తయారీ దిగ్గజ సంస్థ బేయర్, అమెరికాకు చెందిన సీడ్స్ కంపెనీ మోనోశాంటో కొనుగోలుకు సిద్ధమైంది.

ఫ్ర్యాంక్ఫర్ట్ : జర్మనీ ఔషధ తయారీ దిగ్గజ సంస్థ బేయర్, అమెరికాకు చెందిన సీడ్స్ కంపెనీ మోన్ శాంటో కొనుగోలుకు సిద్ధమైంది. ఒక్క షేరుకు 122 డాలర్ల నగదు చొప్పున లేదా మొత్తం 6200 కోట్ల డాలర్ల కొనుగోలు ఆఫర్ ను మోన్ శాంటోకు బేయర్ ప్రకటించింది. ఈ డీల్ తో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ  బేయర్ రూపొందనుంది. ఈ ఆఫర్ మే 9న మోనోశాంటో షేర్ల ముగింపు ధరకు 37 శాతం ప్రీమియమని బేయర్ తెలిపింది.

బేయర్ నుంచి ఈ టేకోవర్ ఆఫర్ ను తాము ఊహించలేదని గతవారం మోన్ శాంటో ప్రకటించింది. ఈ టేకోవర్ ఆఫర్ పై గతకొంతకాలంగా బేయర్ కు, మోనోశాంటోకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. పన్నులు, వడ్డీలు, తరుగుదలన్నీ తీసివేయగా ఉన్న మోన్ శాంటో 12 నెలల రాబడులకు 15.8 సార్లు ఎక్కువగా బేయర్ ఈ ఆఫర్ ప్రకటించింది. డెట్, ఈక్విటీ రెండింటిలోనూ ఈ ఫైనాన్సియల్ డీల్ ను కుదుర్చుకోనున్నామని బేయర్ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement