ఆదాయ వృద్ధిలో బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ టాప్ | BSNL announces launch of value added services under fixed telephony | Sakshi
Sakshi News home page

ఆదాయ వృద్ధిలో బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ టాప్

Published Fri, Apr 8 2016 2:10 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM

ఆదాయ వృద్ధిలో బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ టాప్ - Sakshi

ఆదాయ వృద్ధిలో బీఎస్ఎన్ఎల్ ఏపీ సర్కిల్ టాప్

 సాక్షి, విశాఖపట్నం: ఆదాయ వృద్ధిలో దేశంలోనే బీఎస్‌ఎన్‌ఎల్ ఏపీ సర్కిల్(రెండు తెలుగు రాష్ట్రాలు) నెంబర్ వన్ స్థానంలో ఉందని ఆ సంస్థ ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ పీవీ మురళీధర్ తెలిపారు. విశాఖలోని బీఎస్‌ఎన్‌ఎల్ జనరల్ మేనేజర్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగుల కష్టఫలమే ఈ స్థానమన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో 8 శాతం వృద్ధి రేటు సాధించగలిగామని చెప్పారు.

దేశంలోనే ఏపీ టెలికాం నెంబర్ వన్ స్థాయికి ఎదిగిందన్నారు. సెల్యులర్ విభాగంలో 10%, బ్రాడ్‌బ్యాండ్‌లో 5% వృద్ధి రేటు సాధించామన్నారు. రూ.160 కోట్ల ఆదాయం వచ్చినట్టు తెలిపారు. 17 లక్షల కనెక్షన్లతో మంచి రెవెన్యూ సాధించగలిగామని చెప్పారు. డేటా విషయానికొస్తే ఐదు శాతం పెరిగిందన్నారు. సర్కిల్ పరిధిలో 2జీలో 7,500 2జీ టవర్లు, 3,500 3జీ టవర్లు ఏర్పాటు చేశామని, మరో 1450 3జీ టవర్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.  ఈ ఏడాది చివరికి 4జీ సేవల్లో అడుగుపెట్టనున్నట్టు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement