కాల్ డ్రాప్ సమస్య ఇంకా తీవ్రమే...
వచ్చే వారంలో టెల్కోలతో ట్రాయ్ సమావేశం
న్యూఢిల్లీ: దేశంలో కాల్ డ్రాప్స్ రేటు కొన్ని చోట్ల ఇంకా బెంచ్ మార్క్ (0.5 శాతం) స్థారుు కన్నా ఎక్కువగానే ఉందని టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ పేర్కొంది. అందుకే ఈ అంశంపై వచ్చే వారంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్, రిలయన్స్ జియో వంటి టెలికం సంస్థలతో సమీక్ష నిర్వహిస్తామని తెలిపింది. టెల్కోలన్నీ వాటి కాల్ డ్రాప్స్ రేటును వీలైనంత త్వరగా బెంచ్ మార్క్ స్థారుు కన్నా దిగువకు తీసుకురావాల్సిందేనని, లేకపోతే తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
‘కాల్ డ్రాప్ సమస్యలో పురోగతి కనిపిస్తోంది. ఇది ఇలాగే కొనసాగాలి. అరుుతే కొన్ని చోట్ల కాల్ డ్రాప్ సమస్య అలాగే ఉంటోంది. ఇది ఆందోళనకరం. అందుకే వచ్చే వారంలో పలు టెలికం సంస్థలతో సమావేశం నిర్వహిస్తాం’ అని ట్రాయ్ చైర్మన్ ఆర్.ఎస్.శర్మ తెలిపారు. ‘ఐడియాకు సంబంధించి ఏ సర్కిల్‌లో కూడా కాల్ డ్రాప్స్‌లేవు. ఎరుుర్‌టెల్‌కు ఏడు సర్కిళ్లలో కాల్ డ్రాప్స్ 0.5 శాతం కన్నా ఎక్కువగా ఉన్నారుు. వొడాఫోన్‌కు 11 సర్కిళ్లలో కాల్ డ్రాప్స్ ఉన్నారుు’ అని వివరించారు. కాల్ డ్రాప్స్ సమస్య పరిష్కారానికి మేం తగిన చర్యలు తీసుకుంటూనే ఉన్నామని, ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు పంపామని ఆయన వివరించారు.