
ప్రతీకాత్మక చిత్రం
బీజింగ్: చైనా యాప్‌లపై నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని భారత్ సరిచేసుకోవాలని ఆ దేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం విజ్ఞప్తి చేసింది. డ్రాగన్‌కు చెందిన కంపెనీల పట్ల వివక్ష పూరిత చర్యలు సరికావంటూ అక్కసు వెళ్లగక్కింది. కాగా గల్వాన్ లోయలో ఘాతుకానికి పాల్పడి 20 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న చైనాకు భారత్ గట్టి షాకిచ్చిన విషయం తెలిసిందే. డ్రాగన్‌కు చెందిన టిక్‌టాక్, హెలో వంటి 59 యాప్‌లపై నిషేధం విధించింది. (మీ ఫోన్‌లోని ‘టిక్‌టాక్’కు ఏమవుతుందో తెలుసా?)
ఇక ఈ విషయంపై చైనా వాణిజ్య శాఖ అధికార ప్రతినిధి గావో ఫెంగ్ గురువారం స్పందించారు. విలేకర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఫెంగ్.. భారత్ చర్యలు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలు ఉల్లంఘించేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. తమ దేశంలో భారత ఉత్పత్తులు, సేవల పట్ల ఎలాంటి వివక్ష ప్రదర్శించడం లేదని.. భారత్ సైతం ఇదే విధంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నామన్నారు. కాగా సరిహద్దుల్లో పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న చైనాకు చెందిన యాప్‌లను భారత్ నిషేధించడాన్ని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో స్వాగతించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశ సమగ్రత, జాతీయ భద్రతకు ఉపకరిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. (టిక్‌టాక్ బ్యాన్: చైనాకు ఎంతో నష్టమో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment