సీఎల్‌ ఎడ్యుకేట్‌ ఐపీఓ–ధరల శ్రేణి రూ.500–502 | CL Educate fixes IPO price band at Rs 500-502; to open Mar 20 | Sakshi
Sakshi News home page

సీఎల్‌ ఎడ్యుకేట్‌ ఐపీఓ–ధరల శ్రేణి రూ.500–502

Published Wed, Mar 15 2017 1:20 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

సీఎల్‌ ఎడ్యుకేట్‌ ఐపీఓ–ధరల శ్రేణి రూ.500–502 - Sakshi

సీఎల్‌ ఎడ్యుకేట్‌ ఐపీఓ–ధరల శ్రేణి రూ.500–502

ఈ నెల 20–22 మధ్య ఐపీఓ
న్యూఢిల్లీ: సీఎల్‌ ఎడ్యుకేట్‌ కంపెనీ తన ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ధరల శ్రేణిని రూ.500–502గా నిర్ణయించింది. ఈ నెల 20న మొదలై 22న ముగిసే ఈ ఐపీఓ ద్వారా ఈ కంపెనీ రూ.239 కోట్లు సమీకరించనున్నదని అంచనా. ఈ ఐపీఓలో భాగంగా 21,80,119 తాజా ఈక్విటీ షేర్లతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) కింద 25,79,881 షేర్లను మొత్తం 47.60 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు.

1996లో ప్రారంభమైన ఈ కంపెనీ... కెరీర్‌ లాంచర్‌ బ్రాండ్‌ కింద ఉన్నత విద్య ప్రవేశ పరీక్షలకు శిక్షణనివ్వటం, జీకే పబ్లికేషన్స్‌ పేరిట స్టడీ మెటీరియల్‌ను ప్రచురించటం, కెస్టోన్‌ బ్రాండ్‌తో ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, కస్టమర్‌ ఎంగేజ్‌మెంట్, మ్యాన్‌ పవర్, ట్రైనింగ్‌ సర్వీసులను అందిస్తోంది. ఈ ఐపీఓ ఈ నెల 20–22 మధ్య అందుబాటులో ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement