
తగ్గుతున్న పీసీల విక్రయాలు
న్యూఢిల్లీ : పర్సనల్ కం ప్యూటర్ల(పీసీ) అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో తగ్గాయి. పీసీ మార్కెట్ క్షీణించడం ఇదే తొలిసారి. 2013-14లో 1.18 కోట్లు గా ఉన్న పీసీ అమ్మకాలు గత ఆర్థిక సంవత్సరంలో 10% క్షీణించి 1.06 కోట్లకు తగ్గాయని ఎంఏఐటీ-ఐఎంఆర్‌బీ తాజా నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక వివరాలను మెయిట్ ప్రెసిడెంట్ అమర్ బాబు వెల్లడించారు. దీని ప్రకారం... ఈ ఆర్థిక సంవత్సరంలో పీసీల అమ్మకాలు మరో 10 శాతం తగ్గుతాయి. కాగా నోట్‌బుక్‌ల విక్రయాలు 17 శాతం వృద్ధి చెందుతాయి.