
ముంబై: డీ–మార్ట్ రిటైల్ చెయిన్‌ను నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్‌లో 43 శాతం పెరిగింది. గత క్యూ1లో రూ.175 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.251 కోట్లకు ఎగసింది. నిర్వహణ పనితీరు ఉత్తమంగా ఉండటం, వడ్డీ వ్యయాలు తక్కువగా ఉండటతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని కంపెనీ పేర్కొంది.
ఆదాయం రూ.3,598 కోట్ల నుంచి 27 శాతం వృద్ధితో రూ.4,559 కోట్లకు పెరిగిందని వివరించింది. నిర్వహణ లాభం రూ.303 కోట్ల నుంచి 39 శాతం పెరిగి రూ.423 కోట్లకు చేరిందని, నిర్వహణ లాభ మార్జిన్ 8.4 శాతం నుంచి 9.3 శాతానికి ఎగసిందని పేర్కొంది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్ 1.5 శాతం లాభంతో రూ.1,593 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment