సాక్షి, న్యూఢిల్లీ: 2016, నవంబర్ 8న పెద్దనోట్ల రద్దు సంచలన ప్రకటించి ఏడాది కావస్తున్న సందర‍్భంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర‍్భంగా డీమానిటైజేషన్ ఉపయోగాలను ఏకరువు పెట్టారు. డీమానిటైజేషన్ ఒక చారిత్రాత్మక సందర్భమని ప్రకటించారు. నోట్ల రద్దు సంస్కరణ ద్వారా నల్లధనంపై యుద్ధాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారని తెలిపారు. చరిత్రలో ప్రముఖంగా నిలిచిపోనున్న నవంబరు 8 న నల్లధన వ్యతిరేకంగా పాటించనున్నామని ఆర్థికమంత్రి వెల్లడించారు.
పెద్దనోట్ల రద్దు తరువాత ఆర్థిక రంగంలో అనూహ్యమైన మార్పులు వచ్చాయని ప్రకటించారు. ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను తీసుకొచ్చామనీ, డిజిటల్ లావాదేవీలవైపు దేశం పయనిస్తోందన్నారు. అలాగు పన్నులు కట్టే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. టెర్రరిస్టులకు నిధులు భారీగా క్షీణించాయన్నారు. 18లక్షల మంది అక్రమ డిపాజిట్ దారులను గుర్తించామని తెలిపారు.
కాంగ్రెస్ నల్లధనాన్ని వెలికి తీసేందుకు, అరికట్టేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేకపోయింది, కానీ బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో తాము తీసుకున్న చర్యల పట్ల చాలా సంతృప్తికరంగా కరంగా ఉన్నామరని కేంద్రా ఆర్థిక మంత్రం సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే మాజీ ప్రధాని, మాజీ ఆర్థికమంత్రి ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ విమర్శలను జైట్లీ తిప్పికొట్టారు. భారత ఆర్థికవ్యవస్థ ను 2014 ముందు, తరువాత స్థితిని మన్మోహన్ పోల్చుకోవాలన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ 2014 ముందు రాజకీయ పక్షపాత వైఫల్యాలతో ముగినిపోయింది. కానీ నేడు ఆర్థిక వ్యవస్థలో తాము తీసుకున్న సంస్కరణలపై ప్రశంసించని ఏజెన్సీ లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment