
న్యూఢిల్లీ: భారత్ ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ ప్రెసిడెంట్‌గా దేవయాని ఘోష్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈమె ఇంతకుముందు ఇంటెల్ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరించారు. ఆర్.చంద్రశేఖర్ స్ధానాన్ని ఇప్పుడు దేవయాని భర్తీ చేశారు. ‘ప్రస్తుత డిజిటల్ గ్లోబలైజేషన్ యుగంలో ఐటీ పరిశ్రమకే అధిక ప్రాధాన్యత ఉంది.
ఈ పరిశ్రమ మరింత ఉన్నత స్థాయికి ఎదగడానికి కృషి చేస్తాం. దీనికోసం అందరినీ కలుపుకొని ముందుకెళ్తాం’ అని దేవయాని తెలిపారు. దేశంలోని వివిధ పరిశ్రమల డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఐటీ–బీపీఎం కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో దేవయాని ఘోష్ బాధ్యతలు చేపట్టారు.