పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఈ ఏడాది రూ.30,000 కోట్లుకు మించి ప్రభుత్వానికి ఆదాయం
న్యూఢిల్లీ : పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఈ ఏడాది రూ.30,000 కోట్లుకు మించి ప్రభుత్వానికి ఆదాయం రాకపోవచ్చని డిజిన్వెస్ట్‌మెంట్ (డీఓడీ) శాఖ ఆర్థికమంత్రిత్వశాఖకు నివేదించింది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం ద్వారా రూ.69,500 కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోవడానికి మార్కెట్ ఒడిదుడుకుల పరిస్థితులే కారణమని వివరించింది. మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా భారీ లక్ష్య సాధన వ్యూహం తగిన ఫలితాలను ఇవ్వదని తెలిపింది.
ఇటీవలి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్‌సీ) ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ఘనవిజయం సాధించి, ఖజానాకి రూ.1,600 కోట్లు జమ అయినప్పటికీ డీఓడీ తాజా అంచనాలు ఆసక్తిగా మారాయి. ఆర్‌ఈసీ నుంచి కేంద్రం రూ.1,550 కోట్లు సమీకరించింది.