![ఆస్ట్రేలియా కంపెనీతో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం](/styles/webp/s3/article_images/2017/09/3/61442256525_625x300.jpg.webp?itok=l_vcoPN-)
ఆస్ట్రేలియా కంపెనీతో డాక్టర్ రెడ్డీస్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆస్ట్రేలియాకు చెందిన హాచ్‌టెక్‌కు చెందిన తలలో పేల నివారణకు వినియోగించే ‘ఎక్సిగ్‌లైజ్’ లోషన్‌పై ముందస్తు వాణిజ్య హక్కులను డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ దక్కించుకుంది. ఈ ఒప్పందం ప్రకారం డాక్టర్ రెడ్డీస్ ముందుగా రూ. 66 కోట్లను ( 10 మిలియన్ డాలర్లు) చెల్లిస్తుంది. ఆ తర్వాత ఈ ప్రోడక్ట్ వాణిజ్యపరంగా విజయవంతం అయితే దశల వారీగా రూ. 330 కోట్ల (50 మిలియన్ డాలర్లు) వరకు చెల్లిస్తుంది. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా, కెనడా, రష్యా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెనుజులా, సీఐఎస్ దేశాలతో పాటు ఇండియాలో ఈ లోషన్‌ను విక్రయించడానికి హక్కులను పొందింది. హాచ్‌టెక్ అభివృద్ధి చేస్తున్న ఎక్సిగ్‌లైజ్ లోషన్ ఫేజ్-3 పరీక్షలు విజయవంతం అయినట్లు కంపెనీ 2014లో ప్రకటించింది. ఈ ఔషధానికి యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి లభించాల్సి ఉంది.