న్యూఢిల్లీ : ఫేస్‌బుక్ తాజాగా భారత్‌లో మరో కొత్త సర్వీస్ ప్రారంభించింది. పిల్లల కోసం ఉద్దేశించిన మెసెంజర్ కిడ్స్‌ను గురువారం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం యాపిల్ యాప్ స్టోర్ నుంచి దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని, ఈ వారాంతంలో గూగుల్ ప్లే స్టోర్‌లో కూడా అందుబాటులోకి తెస్తామని ఫేస్‌బుక్ వెల్లడించింది. తల్లిదండ్రుల పర్యవేక్షణలో మెసెంజర్ యాప్ ద్వారా పిల్లలు తమ స్నేహితులతో కనెక్ట్ కావడానికి ఇది ఉపయోగపడుతుందని ఫేస్‌బుక్ తెలిపింది. కరోనా వైరస్ కట్టడికి లాక్‌డౌన్ కారణంగా స్కూళ్లు, కార్యాలయాలు మూతబడటంతో సమాచార మార్పిడికి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడటం పెరుగుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే పిల్లలు కూడా స్నేహితులు, ఇతర కుటుంబ సభ్యులతో కనెక్ట్ అయ్యేందుకు మెసెంజర్ కిడ్స్ ఉపయోగపడుతుందని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment