
పావు శాతం పెంచిన ఫెడ్
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పావుశాతం పెంచింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేటు 1–1.25 శాతానికి చేరుతుంది.
న్యూయార్క్: అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పావుశాతం పెంచింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేటు 1–1.25 శాతానికి చేరుతుంది. వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే రేటును ఫెడ్ ఫండ్స్ రేటుగా వ్యవహరిస్తారు. ఈ ఏడాది ఇది రెండో పెంపు. కాగా 2017లో మరో పెంపు వుంటుందన్న సంకేతాల్ని ఫెడ్ వెలువరించింది.
రెండురోజులగా జరుగుతున్న ఫెడ్ కమిటీ సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంకు బుధవారం విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. జీరో వడ్డీరేట్ల వ్యవస్థ నుంచి 2015 డిసెంబర్‌లో పెంపు ప్రక్రియను ఫెడ్ మొదలుపెట్టింది. అప్పటినుంచి తాజా పెంపు నాల్గవది.