రూ.6,500 కోట్ల విలువైన 13 ఎఫ్‌డీఐలకు ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రూ.6,500 కోట్ల విలువైన 13 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. దీంట్లో రూ.5,900 కోట్ల విలువైన వయామ్ నెట్‌వర్క్స్ ప్రతిపాదనను విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డ్(ఎఫ్‌ఐపీబీ) ఓకే చేసింది. వయామ్ నెట్‌వర్క్‌లో ఏటీసీ(అమెరికా టవర్ కార్పొరేషన్) ఆసియా పసిఫిక్ పీటీఈ మెజారిటీ వాటాను రూ.5,900 కోట్లకు కొనుగోలు చేయనుంది.
రూ.400 కోట్ల విలువైన ఆల్‌స్టోమ్ మాన్యుఫాక్చరింగ్ ఇండియా ప్రతిపాదన, రూ.150 కోట్ల విలువైన సిప్లా ప్రతిపాదనలూ ఆమోదం పొందాయి. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఎఫ్‌ఐపీబీ 26 ఎఫ్‌డీఐ ప్రతిపాదనలను పరిశీలించింది.