సాక్షి, ముంబై: ఆర్‌బీఐ వడ్డీరేటు తగ్గించినా స్టాక్‌మార్కెట్లు ఎందుకు కుప్పకూలాయి. సాధారణంగా కీలక వడ్డీరేటుపై ఆర్‌బీఐ కోత విధించినపుడు సహజంగా స్టాక్‌మార్కెట్లు సానుకూలంగా స్పందించడం ఇప్పటి వరకూ చూశాం. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్ల కొనుగోళ్లపై ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరుస్తారు. దీంతో కీలక వడ్డీరేటు కోత బ్యాంకింగ్ సెక్టార్ భారీగా లాభపడుతుంది. కానీ గురువారం దీనికి భిన్నంగా స్పందించింది. ఈ విపరీత పరిణామానికి విశ్లేషకులు అయిదు కారణాలను ప్రధానంగా చెబుతున్నారు.
విశ్లేషకుల అంచనాలకనుగుణంగానే ఆర్‌బీఐ గవర్నర్ శక్తింకాత దాస్ నేతృత్వంలోని మానటరీ పాలసీ రెపోరేటులో 25 బేసిస్ పాయింట్ల కోతకు నిర్ణయించింది. అదీ కమిటీ సభ్యులందరూ రేటు కోతకే ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ద్రవ్యపరపతి విధాన సమీక్షకు మానిటరీ పాలసీ కమిటీ ఏర్పాటైన తరువాత ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవడం ఇదేమొదటిసారి. అయితే మరి దేశీయ స్టాక్‌మార్కెట్లు ఎందుకు నెగిటివ్‌గా స్పందించాయి. ఆర్‌బీఐ వడ్డీరేటు పదేళ్ల కనిష్ట స్థాయికి చేరగా, తీవ్ర అమ్మకాల ఒత్తిడితో స్టాక్‌మార్కెట్ ఇంట్రాడేలో ఏకంగా 600 పాయింట్ల పతనానికి చేరువైంది. చివర్లో కోలుకున్నా 554 క్షీణించి, సెన్సెక్స్ 40వేల దిగువకు, 178 పాయింట్లు పతనమైన నిఫ్టీ 12వేల దిగువకు చేరింది.
డీహెచ్‌ఎఫ్‌ఎల్ సంక్షోభం : దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ (డిహెచ్ఎఫ్ఎల్) పై క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు క్రిసిల్, ఐక్రా, కేర్ రేటింగ్‌ను బాగా తగ్గించాయి. దీంతో ఇంట్రాడే ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు 15 శాతం కుప్పకూలాయి. రూ. 95 వద్ద అయిదేళ్ల కనిష్టానికి పడిపోయాయి. డెహెచ్ఎఫ్ఎల్ ద్వారా డిహెచ్ఎఫ్ఎల్ ద్వారా డిపాజిట్ హోల్డర్లకు అప్రమత్తంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు గ్లోబల్ బ్రోకరేజి సంస్థ సిఎల్ఎస్ఎ రూ. 1,000 కోట్ల మేర డిఫాల్ట్ అయినట్టు తాజాగా పేర్కొంది. ఇది మరింత ఆందోళన రేపింది.
లిక్విడిటీ అంశం. ద్రవ్య సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆర్‌బీఐ పాలసీ ప్రకటనలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇన్వెస్టర్లలో ఇది మరింత ఆందోళన రేపిందని విశ్లేషకుల అభిప్రాయం. అయితే ద్రవ్య పరిస్థితిని సమీక్షించేందుకు ఆర్‌బీఐ అంతర్గత వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేసింది, వీటి సిఫార్సులు ఆరు వారాల తరువాత మాత్రమే వెల్లడి కానున్నాయి తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)ల భవిష్యత్తు ఆందోళన కూడా ఇతర అంశాలపై ప్రభావితం చేసిందని అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీల రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసని అన్నారు.
మందగించిన జీడీపీ వృద్ధి అంచనాలు: 2019 - 20 ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాపై కోత విధించింది. ట్రేడ్‌వార్ భయాలు, తద్వారా అంతర్జాతీయంగా క్షీణించిన డిమాండ్ లాంటి అంశాలపై కేంద్ర బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది భారత ఎగుమతులు, పెట్టుబడులను ప్రభావితం చేయవచ్చని పేర్కొంది. 2019 ఏప్రిల్ నాటి ఆర్‌బీఐ సమీక్షలో 2019-20 సంవత్సరానికి జిడిపి వృద్ధి అంచనాలు 7.2 శాతం నుండి 7 శాతానికి తగ్గించింది.
ట్రేడ్ వార్ ఆందోళన: అంతర్జాతీయంగా పెరుగుతున్న ట్రేడ్‌వార్ ఆందోళన పెట్టుబడిదారుల్లో అసంతృప్తికి కారణమవుతోంది. ప్రధానంగా అమెరికా-మెక్సికో చర్చల్లో తగిన పురోగతి లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బుధవారం ప్రకటించడం గమనార్హం.
గ్లోబల్ ఆర్థికవ్యవస్థ మందగమనం: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టీన్ లాగార్డే బుధవారం మాట్లాడుతూ టారిఫ్ బెదిరింపులు వ్యాపారాన్ని, మార్కెట్ విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని వ్యాఖ‍్యానించారు. దీంతో వచ్చే ఏడాది వృద్ధిరేటు మందగిస్తుందని భావించారు. మాంద్య పరిస్థితులు వచ్చే అవకాశం లేనప్పటికీ అమెరికా-చైనా ట్రేడ్‌వార్ కారణఃగా 2020 ప్రపంచ స్థూల జాతీయోత్పత్తి 0.5 శాతం, లేదా సుమారు 455 బిలియన్ డాలర్లు తగ్గిపోతుందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment