షాద్‌నగర్‌లో 4 ఫాం ప్లాట్స్‌ ప్రాజెక్ట్‌లు | four form plots projects in shad nagar | Sakshi
Sakshi News home page

షాద్‌నగర్‌లో 4 ఫాం ప్లాట్స్‌ ప్రాజెక్ట్‌లు

Published Sat, Mar 4 2017 12:13 AM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM

షాద్‌నగర్‌లో 4 ఫాం ప్లాట్స్‌ ప్రాజెక్ట్‌లు

షాద్‌నగర్‌లో 4 ఫాం ప్లాట్స్‌ ప్రాజెక్ట్‌లు

స్పేస్‌ విజన్‌ సీఎండీ టీవీ నర్సింహారెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: భవిష్యత్తు అవసరాల కోసం హైదరాబాద్‌లోఓ ప్లాట్‌ కొనాలనే కోరిక శ్రీనివాస్‌ది. కాకపోతే రోజూ సైట్‌కెళ్లి చూసుకునే ప్లాట్‌నే రాత్రికి రాత్రే కబ్జా చేసే నగరంలో కొనాలంటేనే కాసింత భయం. ఇలాంటి పరిస్థితి ఒక్క శ్రీనివాస్‌దే కాదు మనలో చాలా మందిదే. అయితే కొనుగోలుదారులకు ఇలాంటి చిక్కులేవీ లేకుండా ప్లాట్‌పై 24 గంటలు నిఘా వేయటమే కాకుండా మీ స్థలంలో చెట్లను పెంచి వాటి లాభాలనూ కొనుగోలుదారులకు అందిస్తోంది స్పేస్‌ విజన్‌ ఎడిలైఫ్‌. షాద్‌నగర్‌లోని పోలేపల్లి సెజ్‌ కేంద్రంగా 4 భారీ వెంచర్లను అభివృద్ధి చేస్తున్నట్లు సంస్థ సీఎండీ టీవీ నర్సింహారెడ్డి ‘సాక్షి రియల్టీ’కి చెప్పారు.

భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పెట్టుబడి పెట్టేవారికి ఆయా ప్లాట్లలో మలబార్‌ చెట్లు, సేంద్రీయ పండ్ల మొక్కలని పెంచి ఎక్కువ మొత్తంలో లాభం ఆర్జించేలా చేయడమే మా ప్రాజెక్ట్‌ల ప్రధాన ఉద్దేశం. అందుకే అభివృద్ధికి ఆస్కారమున్న షాద్‌నగర్‌ ప్రాంతాన్ని ఎంచుకున్నాం. ఇప్పటికే ఈ ప్రాంతం ఎయిర్‌ కార్గో, ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబెల్, నాట్కో వాటితో పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది.
పోలేపల్లి సెజ్‌కు దగ్గర్లో ఉద్దండపూర్‌లో 110 ఎకరాల్లో గ్రీన్‌ ఎకర్స్‌ ఫాం ల్యాండ్‌ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో ఎకరం, అర ఎకరం యూనిట్‌ వారిగా విక్రయిస్తాం. ధర ఎకరానికి రూ.14 లక్షలు. ప్రతి ఎకరంలో 300 మలబార్, ఐదు రకాల 25 సేంద్రీయ పండ్ల మొక్కలను పెంచుతాం.
మొక్కల పెంపకం, నిర్వహణ కోసం ఎవర్‌ గ్రీన్‌ అగ్రో ఫామ్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆయా మొక్కలు 6–8 ఏళ్లకు వాణిజ్య పరంగా విలువకొస్తాయి. ఆ తర్వాత వీటిని విక్రయించి కొనుగోలుదారులకు అదనపు ఆదాయాన్ని అందిస్తాం. వీకెండ్స్‌లో ఫాంహౌస్‌లో కొనుగోలుదారులు కుటుంబంతో కలిసి ఎంజాయ్‌ చేసేందుకు వీలుగా క్లబ్‌ హౌస్‌ను కూడా నిర్మిస్తున్నాం. 24 గంటల పాటు పటిష్టమైన భద్రత, చెట్ల పెంపకం పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో చేయటం ఈ ప్రాజెక్ట్‌ ప్రత్యేకత.
ఇదే తరహాలో ఈర్లపల్లిలోనూ 100 ఎకరాలను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో ఎకరం ధర రూ.16 లక్షలు. ఈనెలాఖరు నాటికి మరో రెండు ఫాం ల్యాండ్‌ ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్నాం. ముదిరెడ్డిపల్లిలో 130 ఎకరాలు, పొట్లంపల్లిలో 250 ఎకరాల్లో రానున్నాయి. వీటిల్లో సామాన్యులు సైతం కొనుక్కునేందుకు వీలుగా పావు ఎకరంలో కూడా యూనిట్లను విక్రయిస్తాం.

ఫామ్‌ ప్లాట్స్‌ ప్రాజెక్ట్‌లే కాకుండా విట్యాల రామేశ్వరం దేవాలయం ఆనుకుని 300 ఎకరాల్లో ఆంబియెన్స్‌ పేరిట భారీ ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం. ఇది డీటీసీపీ అనుమతి పొందిన ప్రాజెక్ట్‌. 147– 1,000 గజాల్లో ప్లాట్లుంటాయి. గజం ధర రూ.2,599. ఇందులో క్లబ్‌ హౌస్, స్విమ్మింగ్‌ పూల్, స్పా, మెడిటేషన్‌ సెంటర్, చిల్డ్రన్స్‌ ప్లే ఏరియా, జాగింగ్, వాకింగ్‌ ట్రాక్స్‌ వంటి వసతులెన్నో కల్పిస్తున్నాం. వాయిదాల రూపంలో కూడా ప్లాట్లను కొనుగోలు చేయవచ్చు. కస్టమర్లు కోరితే రూ.9 లక్షలకు 650 చ.అ.ల్లో ఇళ్లను కూడా నిర్మించి ఇస్తాం. త్వరలోనే ఓఆర్‌ఆర్‌ గండిమైసమ్మ ప్రాంతంలో 12 ఎకరాల్లో ఇండిపెండెంట్‌ హౌజ్, విల్లా ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించనున్నాం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement